Share News

పారిశుధ్య పనులపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:19 AM

ధవళేశ్వరం, జూలై 8: ధవళేశ్వరం గ్రామంలో నెలకొన్న అపారిశుధ్య పరిస్థితులపై కలెక్టర్‌ ప్రశాంతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో పరిస్థితులను మెరుగుపరచాలని ఆదేశించారు. సోమవారం గ్రామంలో కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మండల అధికారులతో కలిసి పర్యటిం

పారిశుధ్య పనులపై కలెక్టర్‌ ఆగ్రహం
ధవళేశ్వరంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల

ధవళేశ్వరంలో డ్రైన్‌లు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

డ్రైనేజీల అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రణాళిక: ఎమ్మెల్యే గోరంట్ల

ధవళేశ్వరం, జూలై 8: ధవళేశ్వరం గ్రామంలో నెలకొన్న అపారిశుధ్య పరిస్థితులపై కలెక్టర్‌ ప్రశాంతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో పరిస్థితులను మెరుగుపరచాలని ఆదేశించారు. సోమవారం గ్రామంలో కలెక్టర్‌ ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మండల అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైన్‌లలో నీరుపారక బురదమయంగా మారిన రోడ్లపై వీరు నడిచి వెళుతూ పరిశీలించారు. 140 మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నా పారిశు ధ్య పనుల నిర్వహణపై అధికారులు అలసత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది హాజరు వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పలుచోట్ల మురికినీటి కాలువలను ఆక్ర మించి నిర్మాణాలు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ నిర్మాణాలను ఇంటి యజమానులు స్వ చ్ఛందంగా తొలగించుకోవాలని, లేకపోతే పంచాయతీ సిబ్బందిచే ఆ నిర్మాణాలను తొలగించి అం దుకు అయ్యే రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ డ్రైనేజీల కోసం రూ.3 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ఈ నిధులు విడుదలైతే త్వరితగతిన పనులు చేపట్టాల్సి ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పర్యటనలో డీపీవో డి.రాంబాబు, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి కేఎన్‌ జ్యోతి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గోరంట్ల.. స్వచ్ఛభారత్‌

ధవళేశ్వరం శాటిలైట్‌ సిటీలో సోమవారం ఉదయం నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని డ్రైన్‌లో చెత్తను తొలగించారు. టీడీపీ ధవళేశ్వరం పట్టణాధ్యక్షుడు పండూరి అప్పా రావు ఆధ్వర్యంలో ఇది జరుగగా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 01:19 AM