Share News

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:05 AM

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్నికల పోలీసు పరిశీలకుడు బలరాం మీనా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో శుక్రవారం ఆయన పర్యటించి పోలీసు శాఖాపరంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
గోపాలపురంలో స్ర్టాంగ్‌రూమ్‌లు పరిశీలిస్తున్న బలరామ్‌ మీనా

  • ఎన్నికల పోలీసు పరిశీలకుడు బలరాం మీనా

కొవ్వూరు, ఏప్రిల్‌ 26: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్నికల పోలీసు పరిశీలకుడు బలరాం మీనా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో శుక్రవారం ఆయన పర్యటించి పోలీసు శాఖాపరంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. కొవ్వూరు రోడ్‌ కం రైలు బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక చెక్‌పోస్టును తనిఖీచేశారు. అనంతరం సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈవీఏంల స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలను అందజేశారు. కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు, సీఐ వి.జగదీశ్వరరావు సిబ్బ్దంది పాల్గొన్నారు.

  • గోపాలపురంలో..

గోపాలపురంలోని డిస్టిబ్యూషన్‌ సెంటర్‌ స్ర్టాంగ్‌రూమ్‌ను పో లీసు పరిశీలకులు బలరామ్‌ మీనా పరిశీలించారు. సిబ్బంది నిరంతరం అప్ర మత్తంగా ఉండాలన్నారు. అలాగే జగన్నాథపురం శివారులో ఏర్పాటు చేసిన అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టును పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు.

  • నిడదవోలులో నామినేషన్ల పరిశీలన

నిడదవోలు, ఏప్రిల్‌ 26: అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నామి నేషన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతోందని ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్‌కాంత్‌ సరోజ్‌ అన్నారు. శుక్రవారం నిడదవోలులోని ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం కాటన్‌ గెస్ట్‌ హౌస్‌లో మే 12వ తేదీ వరకు రాజకీయపార్టీలకు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదయినా నేరుగా తెలియజేయవచ్చని చెప్పారు. లేని పక్షంలో 89779 35106 నెంబరుకు ఫోన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌వీ రమణ నాయక్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ఎమ్‌.భాను ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:05 AM