Share News

ఎన్నికల విధుల నుంచి ఎస్‌ఐను తొలగించండి

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:06 AM

రాబోయే 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తున్న రంగంపేట ఎస్‌ఐను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలతను కోరారు.

ఎన్నికల విధుల నుంచి ఎస్‌ఐను తొలగించండి

  • జిల్లా కలెక్టర్‌కు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు

రంగంపేట, ఫిబ్రవరి 12: రాబోయే 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తున్న రంగంపేట ఎస్‌ఐను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలతను కోరారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్‌ సక్రమంగా జరిగే విధంగా చర్యలు ఏర్పాట్లు తీసుకోవాలని కోరారు. ఈ మూడు విషయాలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు, సుధాకర్‌రెడ్డి, వెంకటరామారెడ్డి, దేవదానబాబు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:06 AM