Share News

రాష్ట్రంలో తగ్గుతున్న గంజాయి కేసులు

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:59 AM

పి.గన్నవరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గంజాయి సమస్య డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పెద్దగా లేదని, రాష్ట్ర వ్యా ప్తంగా గడిచిన ఆరు నెలల్లో గంజాయి కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలి పారు. నేరాలను అదుపులో ఉంచేందుకు ఏలూ రు

రాష్ట్రంలో తగ్గుతున్న గంజాయి కేసులు
పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న అశోక్‌కుమార్‌

రాజమహేంద్రవరంలో అదుపులోకి వచ్చిన బ్లేడ్‌ బ్యాచ్‌లు

కోనసీమ జిల్లాలో గంజాయి సమస్య పెద్దగా లేదు

రాష్ట్రంలో ఆరువేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి చర్యలు

ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌

పి.గన్నవరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గంజాయి సమస్య డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పెద్దగా లేదని, రాష్ట్ర వ్యా ప్తంగా గడిచిన ఆరు నెలల్లో గంజాయి కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలి పారు. నేరాలను అదుపులో ఉంచేందుకు ఏలూ రు రేంజ్‌ పరిధిలోని 6 జిల్లాల్లో పోలీసు అధికా రులను సమన్వయం చేయ్యడం జరిగిందన్నారు. గంజాయితో పాటు దొంగతనాలను అరికట్టేం దుకు పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచా మని దానిలో భాగంగానే వారు ఉండే ప్రాంతా లను గుర్తించి ఆయా స్టేషన్‌ల పరిధిలో పోలీ సులు వారి కదలి కలపై నిఘా ఉంచా రని పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం పో లీస్‌స్టేషన్‌లో త నిఖీలు నిర్వహించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన ఈగల్‌ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసు అధికా రు లు, సిబ్బందికి సమీ క్షలు నిర్వ హించడం తో పాటు సాంకే తిక పరమైన శిక్షణను ఇవ్వడం జరుగు తుందన్నారు. గంజాయి పట్టుబడిన సమయంలో నేరస్తులు పట్ల ఏవిధంగా వ్యహరించాలో సూచి స్తున్నట్టు ఆయన తెలిపారు. గంజాయి కేసుల విషయంలో కాలయాపన చెయ్యకుండా దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిలకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. అనవసరమైన కేసులు నమోదు చెయ్య కుండా నిజమైన గంజా యి స్మగ్లర్లను గుర్తించి వారిపైనే కేసులు నమో దు చేసేవిధంగా చర్యలు తీసుకుం టున్నా మన్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని, అదేపనిగా నేరాలకు పాల్పడు తున్న వారిపై కొత్త సెక్షన్‌లు వేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో పో లీసులు నిర్వహిస్తున్న చర్యలతో గత 6నెలలుగా బ్లేడ్‌ బ్యాచ్‌లు అదుపులోకి వచ్చాయన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాల న్నారు. బ్యాంకర్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసి కరెంట్‌ అక్కౌంట్‌లపై నిఘాపెట్టామని చెప్పారు.

డబ్బులు పోగొట్టుకుంటే..

అలాగే బాధితులు డబ్బులు పోగొట్టుకున్న 3 గంటల్లోపు 1930 నెంబర్‌కు కాల్‌చేస్తే ఆ డబ్బు మరో వ్యక్తి ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ కాకుండా చూ స్తారన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి 13 ఉమ్మడి జిల్లాలు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది కానిస్టేబుళ్లకు రిక్యూట్‌మెంట్‌ జరుగు తుందని, మరో 18 నెలల్లో ఆ సిబ్బంది అందు బాటులోకి వస్తారన్నారు. కొత్త సిబ్బంది వచ్చిన వెంటనే ముఖ్యంగా సిబ్బంది కొరతతో ఉన్న కోనసీమకు ఎక్కువ మందిని కేటాయిస్తారని ఆయన తెలిపారు. కోనసీమలో ప్రస్తుతం పం డుగలు కాలం కావడంతో ఆయా గ్రామాల పెద్ద లు, యువతతో ముందుగానే సమావేశాలు ఏర్పా టు చేసి జాతర్ల సమయంలో వివాదాలు తలె త్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్టేష న్‌లో రికార్డులను పరిశీలించి అఽధికారులకు సూచ నలు చేశారు. తొలుత ఐజీకి జిల్లా ఎస్పీ బి.కృషా ్టరావు, డీఎస్పీ వై.గోవిందరావు, సీఐ ఆర్‌.భీమ రాజు, ఎస్‌ఐ బి.శివకృష్ణ, సిబ్బంది స్వాగతం ప లికారు. పోలీసుల గౌరవ వందనం అందించారు.

Updated Date - Dec 22 , 2024 | 12:59 AM