Share News

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:43 AM

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఉద్యో గులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకి తభావంతో పనిచేయాలని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం విభాగాల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు.

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కమిషనర్‌

  • మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21(ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఉద్యో గులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకి తభావంతో పనిచేయాలని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం విభాగాల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. హెచ్‌వోడీలతోను, ఉద్యోగులతో మాట్లాడారు.నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. అనంత రం సచివాలయ సెక్షన్‌లో రికార్డులను తనిఖీ చేశారు. పథకాల అమలులో ఎటువంటి లోపా లు ఉండకూడదన్నారు. నగరపాలక సంస్థ చేపట్టే వివిధ సర్వేల ప్రగతిని సంబంధిత యాప్‌ల ద్వారా పరిశీలించారు. క్వారీ సెంటర్‌లో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పె ట్రోల్‌ బంక్‌ను తనిఖీచేశారు. సిబ్బంది అంతా యూనిఫాం ధరించి రెండు షిప్టుల విధానంలో పనిచేయాలని సూచించారు. బంకులో త్వరలో ఈవీ చార్జింగ్‌, సీఎన్‌జీ ఫిల్లింగ్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ అబ్దుల్‌ మాలిక్‌ అస్పర్‌, సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఆర్‌ఐ సీహెచ్‌.శ్రీనివాసరావు, ఐసీఎల్‌ సేల్స్‌ ఆఫీ సర్‌ అమన్‌సోని, బంక్‌ ఇన్‌చార్జులు కృష్ణారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:43 AM