Share News

విజయదుర్గా పీఠంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:24 AM

వెదురుపాక విజయదుర్గా పీఠం వద్ద కార్తీక దీపోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరిపారు

విజయదుర్గా పీఠంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

రాయవరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): వెదురుపాక విజయదుర్గా పీఠం వద్ద కార్తీక దీపోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది మహిళలు, యువతులు తరలివచ్చారు. తొలుతగా పీఠం వద్ద సీతాసదనంలో విజయదుర్గా అమ్మవారి ఉత్సవ విగ్రహనికి, శ్రీదేవి భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి, భవాని సమేత అష్టలింగేశ్వరస్వామికి పూజలు చేశారు. గాడ్‌ స్వామి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. విజయదుర్గా అమ్మవారికి అష్టోత్తర సహస్ర నామాలతో కుంకుమ పూజలు, వేంకటేశ్వరస్వామి, అమ్మవార్లకు అషోత్తర పూజలు, శివఅష్తోత్తర పూజలు చేశారు.

వైభవంగా దీపోత్సవం: పీఠం వద్ద జరి గిన కార్తీక దీపోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పీఠం వద్ద వేదాంత రాజగోపాలచారి ఆధ్వర్యంలో సాయిరామాచార్యులు, మాధవాచార్యులు, శివ, రవిశంకర్‌ పర్యవేక్షణలో జరిపారు. మహిళలు వెయ్యి దీపాలు వెలిగించడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటానికి లక్ష్మీపూజ నీరాజన మంత్ర పుష్పాలు, మహానివేదన చేశారు. దీపోత్సవానికి విచ్చేసిన భక్తులనుద్ధేశించి పీఠాధిపతి గాడ్‌స్వామి మాట్లాడారు. కార్తీక దీపో త్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోలాట నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు జి.సత్యవెంకట కామేశ్వరి, భాస్కరనారాయణ, బలిజేపల్లి రమ, పెదపాటి సత్యకనకదుర్గ, పీఠం పీఆర్వో బాబి, భక్తులు పాల్గొన్నారు.

కోటిపల్లిలో గోదావరికి పౌర్ణమి హారతి

కె.గంగవరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కోటిపల్లిలో కార్తీకపౌర్ణమి సందర్భంగా గోదావరి మాతకు శుక్రవారం హారతినిచ్చారు. ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్ర హాలను నదీ తీరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్మికశాఖా మంత్రి సుభాష్‌ తండ్రి టీడీపీ సీనియర్‌ నాయకుడు వాసంశెట్టి సత్యం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి హారతి ఇచ్చారు. కార్యక్రమంల ఎంపీపీ పం పన నాగమణి, సర్పంచ్‌ పెమ్మాడి బేబి, కూటమి నాయకులు జి.రామ కృష్ణ, సీహెచ్‌ రమణ, వెంటూరు వీర్రాఘవులు చౌదరి, అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:24 AM