Share News

AP News: కాకినాడలో మత్స్యకారుల ఆందోళన.. డిమాండ్లు ఇవే

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:53 PM

Andhrapradesh: కాకినాడలో గురువారం ఉదయం మత్స్యకారులు నిరసనకు దిగారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కొనపపేట గ్రామంలో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించిన ఆందోళన తెలుపుతున్నారు. కాకినాడ నుంచి అద్దరిపేట వెళ్లే బీచ్ రోడ్డుపై నిరసనకారుల ఆందోళన కొనసాగుతోంది. ఎస్‌ఈజెడ్‌లో ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్ర గర్భంలోకి విడిచి పెట్టొద్దంటూ నిరసనకు దిగారు మత్స్యకారులు.

AP News: కాకినాడలో మత్స్యకారుల ఆందోళన.. డిమాండ్లు ఇవే
Fishermen agitation in Kakinada

కాకినాడ జిల్లా, డిసెంబర్ 5: జిల్లాలో మత్స్యకారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి వారు నిరసన తెలపడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఆందోళనను విరమించేది లేదని మత్స్యకారులు తేల్చిచెబుతున్నారు. కాకినాడలో (Kakinada) గురువారం ఉదయం మత్స్యకారులు నిరసనకు దిగారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కొనపపేట గ్రామంలో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించిన ఆందోళన తెలుపుతున్నారు. కాకినాడ నుంచి అద్దరిపేట వెళ్లే బీచ్ రోడ్డుపై నిరసనకారుల ఆందోళన కొనసాగుతోంది.

అమరావతి: ఇద్దరు అధికారుల సస్పెండ్


ఎస్‌ఈజెడ్‌లో ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్ర గర్భంలోకి విడిచి పెట్టొద్దంటూ నిరసనకు దిగారు మత్స్యకారులు. ఫార్మా వ్యర్థాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పైపు లైన్లను తొలగించి తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బోట్‌ను అడ్డంగా పెట్టి మరీ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బోటు పెట్టి ఆందోళనకు దిగడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెర్వో అక్కడకు చేరుకుని.. మత్స్యకారుల సమస్యలను ఆర్డీవోకు తెలియజేశారు. అయితే ఆర్డీవోతో మాట్లాడేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యలపై స్పందించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.

బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..


మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. వాహనదారులకు అంతరాయం కలిగించవద్దని, రోడ్డును క్లియర్ చేయాలని మత్స్యకారులను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోరారు. అయినప్పటికీ తమ ఆందోళనను విరమించేందుకు మత్స్యకారులు సుముఖత వ్యక్తం చేయలేదు. తమ సమస్యకు జిల్లా కలెక్టర్ పరిష్కారం చూపేంత వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

పాకిస్తాన్‌ పేరు మార్చండి మహాప్రభో..!

AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 01:35 PM