Share News

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:45 AM

రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. కొవ్వూరులోని అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాలలో శనివారం వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం
ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆఫర్‌ లెటర్లు అందిస్తున్న మంత్రి దుర్గేష్‌

  • రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్‌

  • స్కిల్‌ను డెవలప్‌ చేసుకోవాలి: కలెక్టర్‌

  • 609 మందికి ఆఫర్‌ లెటర్లు: ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు

  • కొవ్వూరులో మెగా జాబ్‌ మేళా

కొవ్వూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. కొవ్వూరులోని అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాలలో శనివారం వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉద్యోగాలకు ఎంపికయిన వారికి దుర్గేష్‌ ఆఫర్‌ లెటర్‌లను అందజేశారు. జాబ్‌మేళాకు విచ్చేసిన కంపెనీల ప్రతినిధులను ఎమ్మెల్యే ముప్పిడి సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాకు సుమారు 1500 మంది హాజరవ్వగా ఇప్పటివరకు 600 మంది వివిధ కంపెనీల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారన్నారు. ఒకరికి రూ.5 లక్షల వేతనంతో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం వచ్చిందన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ నిరంతర సాధన చేస్తే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. మొబైల్‌ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లేనన్నారు. మొబైల్‌లో యూట్యూబ్‌, వీడియోలు కాకుండా కెరియర్‌ గైడెన్స్‌, మెటీరియల్‌ను ఉపయోగించుకుని కంపెనీలు మన దగ్గరుకు వచ్చేలా సాధన చేయాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యంతో కూటమి ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంటు పాలసీని ఏర్పాటు చేసిందన్నారు. అందరికీ ఉపాధి కల్పించాలని హైస్కూల్‌ నుంచి డిగ్రీ వరకు స్కిల్‌ ఇంటర్నషిప్‌ను ప్రవేశ పెట్టినట్టు చెప్పారు. అలాగే ఇంటింటికీ స్కిల్‌ సర్వే చేపట్టిందన్నారు. సీనియర్‌ విద్యార్థులు, జూనియర్స్‌కు మంచి విషయాలను షేర్‌ చేసి మార్గ దర్శకులుగా నిలవాలన్నారు. ఎమ్మెలేం్య ముప్పిడి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను అంచెలంచెలుగా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తామని, మెగా డీఎస్సీ తీస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. వికాస పీడీ లచ్చారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో విద్యార్హతలను బట్టి ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందన్నారు. 1200 మంది యువత రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా శనివారం సాయంత్రానికి 609 మందికి ఆఫర్‌ లెటర్‌ అందజేశామని, మిగిలినవారికి మరో నాలుగు రోజుల్లో అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, ఆర్డీవో రాణి సుస్మిత, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్‌, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, పిల్లలమర్రి మురళీకృష్ణ, బోడపాటి ముత్యాలరావు, ఏబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జె.సునీత, కాగిత రఘు, చిరంజీవి, సత్తిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:45 AM