Share News

ఉచిత ఇసుక విధానంపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:22 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై అధికారులు పూర్తిగా అవగాహన పెంపొందించుకుని సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వినియోగంపై శనివారం తహసీల్దార్లు, రవాణా ఏజెన్సీలు, మున్సిపల్‌ కమిషనర్లు వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉచిత ఇసుక విధానంపై అవగాహన పెంచుకోవాలి
అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై అధికారులు పూర్తిగా అవగాహన పెంపొందించుకుని సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వినియోగంపై శనివారం తహసీల్దార్లు, రవాణా ఏజెన్సీలు, మున్సిపల్‌ కమిషనర్లు వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇసుక నిర్వహణ వ్యవస్థలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి తావివ్వకుండా పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్టర్‌ ట్రైనీలు ఇసుక నిర్వహణ వ్యవస్థపై పూర్తి అవగాహన చేసుకుని వారే మండల స్థాయిలో సిబ్బందికి వర్క్‌షాపు నిర్వహించి వారిలో అవగాహన పెంచాలని సూచించారు. ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం గనులు, భూగర్భశాఖ రూపొందించిన వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేపట్టాలన్నారు. బుకింగ్‌ అయిన ఇసుక ఎప్పుడు డెలివరీ అవుతుందో వినియోగదారునికి మెస్సేజ్‌ వస్తుందని ఇసుక డెలివరీకి సంబంధించి వినియోగదారునికి ఓటీపీ సాయంతో రవాణాదారులు డెలివరీ ప్రక్రియను ముగిస్తారన్నారు.. 24 గంటలు ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్‌ చెప్పారు. ప్రస్తుత విధానం వల్ల వినియోగదారులపై వెయిటింగ్‌ చార్జీలు ఉండవని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. మండలాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశామని, నదీ గర్భంలో ఓపెన్‌ రీచ్‌లు ఉంటాయని, ఐదు హెక్టార్ల విస్తీర్ణం లోబడి ఉన్న పన్నెండు ఓపెన్‌ రీచ్‌లకు పర్యావరణ క్లియరెన్సు కలిగి ఉన్నాయని చెప్పారు. గోదావరి నదిలో అక్టోబరు 15 నుంచి ఇసుక తవ్వకాలు మాన్యువల్‌గా ట్రాక్టర్ల ద్వారా స్టాకు యార్డులకు తరలించి చేపట్టనున్నామని తెలిపారు. తహసీల్దార్లు, ఇసుక రవాణా ఏజెన్సీల ప్రతినిధులు, సచివాలయ, మున్సిపల్‌ సిబ్బంది, మాస్టర్‌ ట్రైనీలు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 12:22 AM