Share News

వనసమారాధనలతో ఐక్యత

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:04 AM

కార్తీక వన సమారాధనలు మనలోని ఐకత్యకు నిదర్శనమని రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం నిడ దవోలు పట్టణ, మండలంలో జరిగిన పలు వనస మారాధనలకు ఆయన విచ్చేసి మాట్లాడారు.

వనసమారాధనలతో ఐక్యత
నిడదవోలులో బహుమతులు అందజేస్తున్న మంత్రి దుర్గేష్‌

  • సాంస్కృతిక శాఖా మంత్రి దుర్గేష్‌

  • పలుచోట్ల కార్తీక వన సమారాధనలు

  • సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు

  • విజేతలకు బహుమతుల ప్రదానం

నిడదవోలు/పెరవలి, నవంబరు 17(ఆంధ్ర జ్యోతి): కార్తీక వన సమారాధనలు మనలోని ఐకత్యకు నిదర్శనమని రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం నిడ దవోలు పట్టణ, మండలంలో జరిగిన పలు వనస మారాధనలకు ఆయన విచ్చేసి మాట్లాడారు. కార్తీ క వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరు స్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూ రుగుపల్లి శేషారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలా గే పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పిరమిడ్‌ కేంద్రం వద్ద నిర్వహించిన వన సమారా ధనకు మంత్రి దుర్గేష్‌ విచ్చేశారు. సమీపంలోని శివాలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 01:04 AM