Share News

జీవో నంబరు 115 రద్దు చేసి న్యాయం చేయాలి

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:22 AM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 115ను రద్దుచేసి కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులకు న్యాయం చేయాలంటూ బుధవారం అమలాపురం ఏరియా ఆసుపత్రి ప్రాంగణం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు

జీవో నంబరు 115 రద్దు చేసి న్యాయం చేయాలి

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 115ను రద్దుచేసి కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులకు న్యాయం చేయాలంటూ బుధవారం అమలాపురం ఏరియా ఆసుపత్రి ప్రాంగణం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. స్థానిక నల్లవంతెన వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 15ఏళ్లు పైబడి కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులుగా పనిచేస్తున్న తమను కాదని ఏఎన్‌ఎంలకు స్టాఫ్‌నర్సు పోస్టులను కట్టబెట్టడం శోచనీయమని విమర్శించారు. అన్ని అర్హతలు ఉన్న కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలంటూ ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. నిరసనలో ఎస్‌.సత్యవతి, పి.దుర్గాభవాని, కె.కామేశ్వరి, ఆర్‌.శివకుమారి, కె.విజయదుర్గ, అరుణ, బి.శ్రీలక్ష్మి, కె.రజనీ, కె.కుమారి, ఆర్‌.లోవదేవి, వి.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 12:22 AM