Share News

ఆదమరిస్తే గోదాట్లోకే..

ABN , Publish Date - May 18 , 2024 | 12:45 AM

ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది చారిత్రాత్మక రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన. దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్య నిర్ణ యాలతో సర్వనాశనం చేశారు. మరమ్మతుల పేరిట కొన్నిసార్లు, ప్రతి పక్ష పార్టీల యాత్రలను వంతెన మీదుగా వెళ్లకుండా చేయడానికి మరమ్మతులంటూ మరికొన్నిసార్లు పెద్ద తతంగమే నడిపారు. అంతం కాదిది ఆరంభం అన్న చందంగా బాగుచేసే పనులు అనేక సార్లు సాగించారు.

ఆదమరిస్తే గోదాట్లోకే..
బ్రిడ్జి పక్కన ఇనుప గ్రిల్స్‌ ఎట్టకేలకు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు

  • మరమ్మతుల పేరిట తతంగం.. చేసింది శూన్యం

  • ఇప్పుడు మరోసారి తంతు.. రోడ్‌కం రైల్‌ బ్రిడ్జి దుస్థితి ఇది

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి): ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది చారిత్రాత్మక రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన. దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్య నిర్ణ యాలతో సర్వనాశనం చేశారు. మరమ్మతుల పేరిట కొన్నిసార్లు, ప్రతి పక్ష పార్టీల యాత్రలను వంతెన మీదుగా వెళ్లకుండా చేయడానికి మరమ్మతులంటూ మరికొన్నిసార్లు పెద్ద తతంగమే నడిపారు. అంతం కాదిది ఆరంభం అన్న చందంగా బాగుచేసే పనులు అనేక సార్లు సాగించారు. ఆ క్రతువులో కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో జేబుల్లో వేసుకున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. మరోవైపు మర మ్మతు పనుల కోసం నెలల తరబడి వంతెనపై ట్రాఫిక్‌ నిలిపివేసి జనా లను ఇబ్బందులకు గురిచేసినా చివరికి ఒరిగిందేమీ లేదు. వంతెన బాగు పడిందీ లేదు. పైగా మరింత ప్రమాదకరంగా తయారైంది. మరమ్మతుల కోస మంటూ ట్రాఫిక్‌ నిలిపివేసినా ప్రతిసారీ ధ్వంసమైన రెయిలింగ్‌లకు రంగులు వేయడం, బ్రిడ్జిపై తారురోడ్డు వేయడం వంటి వాటితో సరిపెట్టారు. అదేంటోగాని ప్రతిసారీ ప్రతిపక్షాల నేతలు ఈ వంతెనపై నుంచి వచ్చే సమయంలోనే మరమ్మతులకు తెరతీసేవారు. ఆ క్రమంలో అమరావతి రైతులనూ ఇబ్బందిపెట్టారు. ఇంతా చేసి వంతెన మరమ్మతులను మాత్రం ఈనా టికీ పూర్తిచేయలేకపోయారు. అక్కడక్కడా సిమెంటు రెయిలింగ్‌ని తీసేసి ఇనుప కమ్మెలతో రెయిలింగ్‌ ఏర్పాటుచేస్తున్నారు. భద్రత దృష్ట్యా ఈ పనులు అత్యంత వేగంగా జరగాల్సి ఉం డగా అవి నత్తతో పోటీపడుతున్నాయి. ఇప్పుడు రెయిలింగ్‌ తీసేసిన చోట ఇదిగో ఇలా ట్రాఫిక్‌ సిమెంటు దిమ్మలను ఏర్పా టుచేశారు. దీంతో ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అదుపు తప్పితే పాద చారులు సైతం గోదావరిలోకి పడిపోవాల్సిందే. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల అలసత్వాన్ని వెక్కిరిస్తోంది. రాజమహేంద్రవరానికి ఈ వంతెన ఆసి యాలోనే ఒక ప్రత్యేక పేరును నిలిపితే.. అటు ప్రభుత్వం, ఇటు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహించడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 18 , 2024 | 12:45 AM