Share News

నదీకోత నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:52 AM

పి.గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పూర్తిగా నదీ పరివాహక ప్రాం తాలని, వరదల సమయంలో ఈప్రాంత రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.

నదీకోత నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

పి.గన్నవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పి.గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పూర్తిగా నదీ పరివాహక ప్రాం తాలని, వరదల సమయంలో ఈప్రాంత రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. నియోజ కవర్గంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అసెం బ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కోతకు గురైన భూములకు బాధిత రైతులకు ఏవిధమైన నష్టపరిహారం అందడంలేదన్నారు. ప్రభుత్వం నదీ కోత నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పి.గన్నవరం మండలంలోని గంటిపెదపూడి, ఉడిమూడి గ్రామాల పరిధిలోని నాలుగు లంక గ్రామాల రాకపోకలు కోసం నదీ పాయపై రూ.49.50కోట్లతో వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు ఏవిధమైన బిల్లులు మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేస్తే, వంతెన నిర్మాణం పూర్తవు తుందని, తద్వారా లంకగ్రామాల ప్రజలకు వరదల సమయంలో ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. వరదలకు అయినవిల్లి మండలం ఎదురుబీడిం, మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రెండు చోట్ల కాజ్‌వేలు నిర్మాణం చేస్తే ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఎమ్మెల్యే వివరించారు.

Updated Date - Nov 17 , 2024 | 12:52 AM