గోదారి..మారుతుందోచ్!
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:23 AM
అఖండ గోదావరికి పర్యాటక కళ రానుంది. వచ్చే పుష్కరాలకు హేవలాక్ బ్రిడ్జి, పుష్కర ఘాట్, కడియం నర్సరీలు, విజ్జేశ్వరం-నిడదవోలు కాల్వ, కోటసత్తెమ్మ గుడి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందనున్నాయి.
పర్యాటక నిధుల ప్రవాహం
తొలి విడతగా రూ.62 కోట్లు
మారనున్న హేవలాక్ వంతెన
ఇక మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్
ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కరఘాట్
కడియం నర్సరీలకు శోభ
విజ్జేశ్వరం కాలువలో బోట్ షికార్
త్వరలో టెండర్లు ఆహ్వానం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
అఖండ గోదావరికి పర్యాటక కళ రానుంది. వచ్చే పుష్కరాలకు హేవలాక్ బ్రిడ్జి, పుష్కర ఘాట్, కడియం నర్సరీలు, విజ్జేశ్వరం-నిడదవోలు కాల్వ, కోటసత్తెమ్మ గుడి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందనున్నాయి. అఖండ గోదావరి ప్రా జెక్టుకు రూ.94.44 కోట్లు మంజూరుకాగా అందు లో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టే ట్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కి) పథకం కింద రూ.62 కోట్లు విడుదలచేసింది. రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.
హేవలాక్ బ్రిడ్జి
రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావ రిపై నిర్మించిన మొదట రైల్వే బ్రిడ్జిని మల్టీ ఫం క్షనల్ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. 127 ఏళ్ల ఈ బ్రిడ్జిని చారిత్రక కట్టడంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. ఈ మేరకు రెండు దశాబ్దాల కిందట అప్పట్లో సీఎం చంద్రబాబు చొరవతో రైల్వేశాఖకు రూ.10 కోట్లు చెల్లించి బ్రిడ్జిని స్వాధీనం చేసుకున్నారు. గత పుష్కరాల సమయంలో అప్పటి సీఎంగా చంద్ర బాబు అఖండగోదావరి ప్రాజెక్టు కింద హేవ లాక్ బ్రిడ్జి, గోదావరి లంకలు, ఘాట్లు అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. రూ.100 కోట్లు కేటా యించారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదా వరి రీజనల్ కార్యాలయం ఏర్పాటుచేశారు. తర్వా త 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అఖండ గోదావరి ప్రాజెక్టును ఎత్తేసింది. పర్యాటక కళల ను ధ్వంసం చేసింది. ప్రస్తుతం కూటమి అధికా రంలోకి రావడంతో అఖండ గోదావరికి మళ్లీ జీవంపోసింది. 2,700 మీటర్ల పొడవుతో 18 స్పా న్స్‌తో ఉన్న హేవలాక్ బ్రిడ్జిని సాసి పథకం కింద మల్టీఫం క్షనల్ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దను న్నారు. థీమేటిక్, బఫర్ జోన్లుగా విభజించారు. థీమేటిక్ జోన్‌లో వాటర్‌ఫాల్, గ్లాస్ బ్రిడ్జిలు, ఎస్పేస్ థీమ్డ్ జన్, అర్బన్‌హాట్, అక్వేరియం టన్నెల్స్ ఇతర సౌక ర్యాలు కల్పిస్తారు. బఫర్‌జోన్‌లో గోదావరిని వ్యూ పాయింట్ నుంచి చూసేలా అభివృద్ధి చేస్తారు.
పుష్కర ఘాట్ అభివృద్ధి
ఆధ్యాతిక కేంద్రంగా పుష్కరఘాట్ తీర్చి దిద్దనున్నా రు. గోదావరి మాత గుడిని నిర్మిం చనున్నారు. ఇక్కడ శివపార్వతులు, వినాయక, కార్తికేయ ఆలయాలు నిర్మిం చనున్నారు. నక్షత్ర స్తంభాలు దివ్యత్వం ఉట్టిపడేటట్టు గోదావరి, ఆస్ర్టాలాజికల్ స్టార్స్ నిర్మించ నున్నారు. మం డపాలు, మెడిటేషన్, స్విరిట్చువల్, వాణిజ్య సౌకర్యాలు కల్పించనున్నారు.
కడియంలో కన్వెన్షన్ సెంటర్..
ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కడియం నర్సరీలకు మరింత పర్యాటక శోభ రానుంది. కడియపులంకలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. నర్సరీలలో ఒక నర్సరీ నుంచి మరో నర్సరీకి వెళ్లి తిలకించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పొట్టిలంక, కడియపులంక, వేమగిరి మధ్య బోట్ షికారు ఏర్పాటుచేసి, నర్సరీలు సందర్శిం చేలా తీర్చిదిద్దనున్నారు. డిజైన్లను ధవళేశ్వరానికి చెందిన ఆర్కిటెక్ట్ భమిడిపాటి కిరణ్ రూపొందించారు.
సమిశ్రగూడెం కాలువలో..
నిడదవోలు కోటసత్తెమ్మ గుడికి మరింత ప్రాధాన్యత సంతరించేలా ఇక్కడ టూరి జాన్ని అభివృద్ధి చేయను న్నారు.నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఇక్కడ ప్రతిపాదన చేయడంతో పాటు నిధులు మంజూరు చేయించారు. విజ్జేశ్వరం నుంచి నిడదవోలు గుండా వెళ్లే ప్రధాన పంట కాలువలో సమిశ్రగూడెం వద్ద కాలువలో బోటు షికారు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ రెస్టారెంట్ సిద్ధం చేయనున్నారు.
వచ్చే పుష్కరాలకు రూపురేఖలు మారుస్తాం..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు పర్యాటక ప్రాజెక్టులకు రూ. 113.751 కోట్లు విడుదల చేస్తూ ఉత్త ర్వులిచ్చింది. అఖండగోదావరికి, గండికోట ప్రాజెక్టుకు కలిపి మొత్తం రూ.177 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. వచ్చే పుష్కరాలకే రూపురేఖలు మారతాయి.
- కందుల దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి