గోదాములపై ఉక్కుపాదం
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:26 AM
కాకినాడ జిల్లా కరప మండలం కొరి పల్లి అద్దె గోదాములో రేషన్ బియ్యం మా యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అన్ని ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదే శించింది. కాకినాడ జిల్లాలో ఎనిమిది గోదా ములను పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసు కుని రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసింది.
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 24(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కరప మండలం కొరి పల్లి అద్దె గోదాములో రేషన్ బియ్యం మా యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అన్ని ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదే శించింది. కాకినాడ జిల్లాలో ఎనిమిది గోదా ములను పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసు కుని రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసింది. అయితే ఇటీవల కొరిపల్లి గోదా ములో బియ్యం మాయమైనట్టు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు తనిఖీ చేసి 229 మెట్రిక్ టన్నులు మాయమైనట్టు ప్రభుత్వా నికి నివేదిక పంపారు. ఈనేపథ్యంలో మంగళ వారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో రేషన్ బియ్యం నిల్వ చేసిన ప్రతిగోదామును తనిఖీలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా ఆదేశించారు. రికార్డులను పరిశీలించి గోదాముల్లో ఉన్న బియ్యాన్ని తనిఖీలు చేసి వ్యత్సాసాలుంటే గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా రేషన్ బియ్యం ప్రైవే ట్ గోదాం యజమానులు మాయం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో ఒక వరుస క్రమంలో రేషన్ నిల్వ చేసిన గోదాములను తనిఖీ చేసి నివే దిక పంపిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా ఆంధ్రజ్యోతికి వెల్లడించారు.