Share News

Dhanteras 2024: స్వర్ణం కొంటే..సిరుల పంట

ABN , Publish Date - Oct 29 , 2024 | 01:11 AM

పండగలంటేనే అందరికీ సంతోషం. ఆరోజు ఏదొకటి మంచి పనిచేసుకోవాలని భావిస్తుంటారు. పండగలలో ధనానికి సంబంధించిన పండగలంటే మర్చిపోలేని పండగే. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి అంటే మహిళలకు భలే ఇష్టం. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో బాగా ఐశ్వర్యంతో వృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది.

Dhanteras 2024: స్వర్ణం కొంటే..సిరుల పంట
Denteras

కార్పొరేట్‌ సంస్థలతో ఉత్తరాది నుంచి వచ్చిన సెంటిమెంట్‌ ఇది

అక్షర తృతీయ, వరలక్ష్మి, వ్రతాలకూ మనకు అదే సెంటుమెంట్

బంగారం ధరలు చూస్తే ఆకాశంలో.. 22క్యా. గ్రాము ధర రూ.7,315


Gold rate today on Dhanteras 2024:(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): పండగలంటేనే అందరికీ సంతోషం. ఆరోజు ఏదొకటి మంచి పనిచేసుకోవాలని భావిస్తుంటారు. పండగలలో ధనానికి సంబంధించిన పండగలంటే మర్చిపోలేని పండగే. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి అంటే మహిళలకు భలే ఇష్టం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో బాగా ఐశ్వర్యంతో వృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అక్షయ తృతీ య రోజు బంగారం కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున బంగారం కొనాలనే సెంటుమెంట్ బాగా ఉంది. కనీసం బంగారపు లక్ష్మీదేవి రూపు అయినా కొనాలని ప్రతి మహిళా ఆరాటపడతారు. గత కొన్నేళ్లుగా బంగారం వ్యాపారం కార్పొరేషన్‌ సంస్థల చేతులలోకి వెళ్లి పెద్ద షోరూమ్‌లన్నీ నగరాలు, పట్టణాలు, చివరకు గ్రామాల్లోకి కూడా ప్రవేస్తున్న సంగతి తెలి సిందే.


gold.jpg


ధన త్రయోదశి

ధనత్రయోదశి అనే సెంటిమెంట్‌ను ఈ సంస్థలే తెలుగు ప్రాంతాల్లో విస్తృతవ్యాప్తిలోకి తెచ్చాయని స్థానిక వ్యాపారుల కథనం. ఉత్తరాదిలో ఇటువంటి సెంటిమెంట్‌ ఎక్కువగా ఉందనేది వారి వాదన. దాంతో ఇక్కడ వ్యాపారం వృద్ధి చెందడం కోసం, ప్రతీ ఒక్కరూ ఏడాదికి కనీసం రెండుసార్లయినా బంగారం కొంటే మంచిదనే సెంట్‌మెంట్‌ వ్యాప్తి చెందింది. అందుకే ఎండాకాలంలో అక్షయ తృతీయ, దీపావళికి ముందు ధనత్రయోదశి రోజున బంగారం కొనడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కొనుక్కునేవారు. తర్వాత పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కొనుగోలు చేసేవారు. ఇక ధన త్రయోదశి, అక్షయ తృతీయ రోజుల్లో కొనుగో లు చేస్తే సంవత్సరం అంతా కొంటామనే సెం టిమెంట్‌ ప్రచారంలోకి రావడం వల్ల దానిని నమ్మిన ప్రజలు బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


Gold.jpg


ధన్వంతరి..

బంగారం కొనలేని వారు ఏదొక చిన్న వస్తువునైనా కొనుగోలు చేయడం కూడా ఆనవాయితీగా మారిందని చెబుతు న్నారు. ఇక ధనత్రయోదశి అంటే ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్యం దైవం ధన్వంతరి. ఆయన పుట్టినరోజును ధనత్రయోదశిగా జరుపు కుంటారు. ధన్వంతరిని ధ్యానిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు జీవితకాలం ఉంటాయని చెబుతుంటారు. పైగా ధనత్రయోదశి అనేది కొత్త దనానికి ఆరంభంగా చెబుతారు. అందువల్ల ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలుచేయడం మంచిదంటారు.


Gold.jpg


లక్ష్మీదేవి, కుబేరుడికి పూజలు

ఇక ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి, కుబేరుడు కూడా పూజ చేస్తారు. ఇక బంగారం కొనుగోలు చేస్తే సాక్షాత్తూ మహాలక్ష్మిదేవి ఇంట్లో తరలివస్తుందనేది ఓ సెంటిమెంట్‌గా అందరూ భావిస్తారు. అందుకే ఏదోవిధంగా బంగారం కొనుగోలు చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. వాస్తవానికి ఈ పండుగ హిందువులకు సంబంధించినది అయినా, బంగారం అన్ని వర్గాలు కొనుగోలు చేయడం గమనార్హం. ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఒకే రోజు కొనుగోలు చేసుకోకపోవచ్చు. అందువల్ల చాలా దుకాణాల్లో స్కీమ్‌ అందుబాటులో ఉన్నాయి. నెలకు ఇంతని చెల్లిస్తే, మొత్తం వాయిదాలు అయిన తర్వాత బంగారం ఇస్తా రు. ఒక రూపాయితో డిజిటల్‌ పేమెంట్‌ చేసి, ఆయా వ్యక్తుల పేర్ల మీద వాలెట్‌ ప్రారంభించే అవకాశం కూడా ఉంది.


Gold-buying.jpg


బాగా పెరిగిన బంగారం

బంగారం అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఆడ, మగ తేడా లేకుండా ఎవరైనా బంగారం అంటే ఇష్టపడతారు. బంగారాన్ని కేవలం ధరించడానికే కాకుండా పెట్టుబడిగా కూడా పరిగణిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా బం గారం ధరలు బాగా పెరిగిపోయింది. సోమ వారం రాజమహేంద్రవరం మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,315గా ఉంది. ఇది ఆదివారం రూ.7360గా ఉంది. అం టే సోమవారం రూ.45కు తగ్గింది. ఇలా బం గారం ధరలు రోజూ మారుతున్నాయి. అటు 24 క్యారెట్‌ బంగారం ధర 1 గ్రాము రూ. 7,980గా ఉంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు ఏమేరకు ఉంటాయో చూడాలి.

ఇది కూడా చదవండి:

Gold And Silver Price: పండగ వేళ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 29 , 2024 | 01:09 PM