గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:14 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పురోగతిపై రాష్ట్రస్థాయిలో మోనటరింగ్ నిర్వహిస్తున్నారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయిలోని ఆడిట్ బృందాలు నేరుగా అర్జీదారులకు ఫోన్‌చేసి సమస్య పరిష్కారంపై సంతృప్తి చెందారా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు. ప్రజా ప్రతినిధులకు కూడా ప్రజల గ్రీవెన్స్‌ను రిజిస్టర్ చేయడానికి లాగిన్లు ఇచ్చారన్నారు. వారు కూడా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఆన్‌లైన్ రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటూ జిల్లా అధికారులను మోనటరింగ్ చేస్తున్నట్టు వివరించారు.
అమలాపురం టౌన్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పురోగతిపై రాష్ట్రస్థాయిలో మోనటరింగ్ నిర్వహిస్తున్నారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయిలోని ఆడిట్ బృందాలు నేరుగా అర్జీదారులకు ఫోన్‌చేసి సమస్య పరిష్కారంపై సంతృప్తి చెందారా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు. ప్రజా ప్రతినిధులకు కూడా ప్రజల గ్రీవెన్స్‌ను రిజిస్టర్ చేయడానికి లాగిన్లు ఇచ్చారన్నారు. వారు కూడా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఆన్‌లైన్ రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటూ జిల్లా అధికారులను మోనటరింగ్ చేస్తున్నట్టు వివరించారు. అర్జీలను నిర్ణీత వ్యవధిలో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రధానంగా పురపాలక, పంచాయతీరాజ్, సర్వే, సెర్ప్, రెవెన్యూ, పోలీసు, పౌరసరఫరాలు, ఆరోగ్య శాఖలకు సంబంధించిన అర్జీలు అత్యధికంగా అందుతున్నాయని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొందరు అధికారులు అర్జీలను పరిష్కరించేటప్పుడు తప్పుగా ట్యాగింగ్, డిస్పోజల్ ఎండార్స్‌మెంట్ చేస్తున్నారని అటువంటి అధికారులు తప్పిదాలను సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ ప్రభుత్వ శాఖకు సంబంధించి జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో గ్రీవెన్స్ నోడల్ అధికారులను నియమించే దిశగా మంగళవారం ఉత్తర్వులు జారీచేసి జిల్లా యంత్రాంగానికి వివరాలు సమర్పించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్‌చార్జి డీఆర్వో మదన్మోహనరావు, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరాణి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 130 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా, డీపీవో డి.శాంతలక్ష్మి, పంచాయతీరాజ్ డీఈ రామకృష్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ బి.రాము, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కార్తీక్, సీపీవో వెంకటేశ్వర్లు, ఇండస్ర్టీస్ జీఎం ప్రసాద్ పాల్గొన్నారు.