ఆరోగ్య ప్రదాయిని...
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:50 AM
ఒకప్పుడు పాడితోనే పంట ముడిపడి ఉండేది. అందుకే పాడిపంటలు అనేవారు. పాడి నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పెంటే ఎరువుగా పంటలు పండించేవారు. ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వినియోగించేవారు కాదు.
రోగ నిరోధక శక్తిని పెంచే పాలు
ఆరోగ్యవంతమైన జీవనానికి పాలే ప్రధానం
నేడు ప్రపంచ పాల దినోత్సవం
అమలాపురంరూరల్, మే 31: ఒకప్పుడు పాడితోనే పంట ముడిపడి ఉండేది. అందుకే పాడిపంటలు అనేవారు. పాడి నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పెంటే ఎరువుగా పంటలు పండించేవారు. ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వినియోగించేవారు కాదు. దాంతో ఆరోగ్యవంతమైన పంటలను రైతులు పండించేవారు. ఆరోగ్యవంతమైన పంట దిగుబడులతో రోగరహితంగా ప్రజలు ఒకప్పుడు జీవించారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తికాదు. ఆధునిక సమాజం పాడినుంచి పంటను దూరం చేస్తుంది. పాడి పెంపకానికి అవసరమైన గడ్డి కూడా దొరకని పరిస్థితికి వ్యవసాయ యాంత్రీకరణ విధానాలు అందుబాటులోకి వచ్చేశాయి. వేలకు వేలు చెల్లించినా ఎండుగడ్డి దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో పాడి పెంపకమంటేనే రైతులు భయపడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ప్రభావం పాల ఉత్పత్తులపై తీవ్రంగా పడింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తులు ఏనాడో తగ్గిపోయాయి. పాడిపంటల్లో ముందుండే కోనసీమ వంటి ప్రాంతాల్లోనే పాలను దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. దానికితోడు పాలపొడితో, కల్తీ పాలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన పాల దిగుబడులు కోసం ఐక్యరాజ్యసమితి నడుం బిగించింది. ప్రపంచ ఆహారసంస్థ ఆధ్వర్యంలో ప్రతిఏటా జూన్1న ప్రపంచ పాలదినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది.
శ్రేష్ఠమైన ఆహారం పాలు
సృష్టిలో శ్రేష్ఠమైన ఆహారంగా మొదట చెప్పుకునేది పాలనే. ఆవులు, గేదె లు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు..ఇలా క్షీరదజాతి పాడిపశువులు, జంతువులు పాల ఉత్పత్తులకు ముఖ్య వనరులుగా ఉన్నాయి. అనేక జబ్బులను తగ్గించుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వందలాది రూపాయలు వెచ్చించి గాడిద పాలు కొనుగోలుచేసి తాగుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవనానికి పాలే ప్రధానంగా నిలుస్తాయి. పాలలో ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఇతర పదార్ధాలు పుష్కలంగా ఉండటంవల్ల సమీకృత ఆహా రంగా పాలను ప్రకటించారు. రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడంతోపాటు తక్షణశక్తిని అందించేది పాలుమాత్రమే.
జిల్లాలో ఆవులకంటే గేదెలే ఎక్కువ
జిల్లాలో తెల్లజాతి పశువుల కన్నా నల్లజాతి గోవులే అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.29లక్షల పాడి పశువులు ఉండగా వాటిలో 1,53,542 గేదెలు, 75,460 ఆవులు ఉన్నాయి. పంజాబ్ నుంచి ముర్రా జాతి గేదెలను ఎక్కువగా దిగుమతి చేయడం జరిగింది. ముర్రా జాతి గేదెల వీర్యంతో దేశీయ గేదెలను సంకర పరచడం ద్వారా పాల ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. గేదెలకు మాత్రమే ఈ విధానాన్ని పరిమితం చేయలేదు. జెర్సీ ఆవులను దేశవాళీ ఆవులతో క్రాసింగ్ చేయడంవల్ల పాల ఉత్పత్తి పెరిగేలా ఆవుల పెంపకం జరిగింది.
పాలతో ప్రయోజనాలు
పాలు తాగడం వల్ల మనిషికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. పచ్చిపాలలో పోషక విలువలు, కాల్షియం ఉన్నప్పటికీ రకరకాల సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. గేదె పాలలో కొలస్ర్టాల్ శాతం తక్కువగా ఉండి మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. వెన్న శాతం గేదెపాలలోనే ఎక్కువగా ఉంటుంది. ఆవుపాలతో సమానంగా మేక పాలు మంచిని చేస్తుంటుంది. లాక్టోస్ సమస్యలు ఉన్న చిన్నపిల్లలకు ఆవుపాలకంటే మేక పాటు ఇవ్వడం మేలు, ఇక పాలతో ఎన్నో ఉపఉత్పత్తులు తయారవుతున్నాయి. పాల నుంచి ఉత్పత్తి అవుతున్న పన్నీర్‌కు మంచి డిమాండు ఉంది.
నెలకు 37,338 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి
జిల్లాలో 2.29లక్షల పాడి పశువుల నుంచి సగటున నెలకు 37,338 మెట్రిక్ టన్నుల పాల ఉత్పిత్తి జరుగుతుంది. దేశవాళీ ఆవులు, గేదెలను వేర్వేరుగా జెర్సీ, ముర్రా జాతి పశువులతో సంకరణం చేయడం వల్ల పాల ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రైతులకు అవసరమైన టోటల్ మిక్సడ్ రేషన్(టీఎంఆర్)ను అత్యధికంగా జిల్లాలోనే 80శాతం రాయితీపై పాడి రైతులకు అందజేశాం. గత రెండేళ్లలోను రూ.2.50 కోట్ల విలువైన టీఎంఆర్‌ను పాడి రైతులకు అందించాం.
డాక్టర్ కర్నీడి మూర్తి,
డిప్యూటీ డైరెక్టర్, ప