Share News

చల్లబడిన వాతావరణం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:32 AM

గత వారం రోజులుగా ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరైన జనం శుక్రవారం సాయంత్రం సేద తీరా రు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండలు మండిపోయాయి. ఈ నెల 7న చవితి ముసురుగా పట్టింది.. వానపడింది.

చల్లబడిన వాతావరణం
నిడదవోలులో నీట మునిగిన ప్రధాన రహదారి..

రాజమహేంద్రవరం సిటీ/పెరవలి/ గోపాల పురం/తాళ్లపూడి/నల్లజర్ల/కొవ్వూరు, సెప్టెంబరు 20 : గత వారం రోజులుగా ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరైన జనం శుక్రవారం సాయంత్రం సేద తీరా రు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండలు మండిపోయాయి. ఈ నెల 7న చవితి ముసురుగా పట్టింది.. వానపడింది. 8వ తేదీ నుంచి వానలులేవు. పైౖగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఎండలకు జనం ఉక్కపోతతో సతమతమయ్యారు. పలువురు జ్వరాల బారిన పడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం నుంచి తీవ్రమైన ఎండ.. ఇదేం ఎండరాబాబూ అనుకున్నవారే. అయితే సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆకాశం మేఘావృతమై కారుమబ్బులతో ఒక్కసారిగా వరుణుడు విజృం భించాడు. దీంతో వాతావరణం చల్లబడింది. రాజమహేంద్రవరంలో కోరుకొండరోడ్డు, కంబాలచెరువు, రామచంద్రరావు పేట, దేవిచౌక్‌, పేపరుమిల్లు రోడ్డు, క్వారీ సెంటర్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులు తడిచిముద్దయ్యా యి.చాలాకాలం తరువాత వాన పడడంతో జనం సేదతీరారు. వాతవరణం పూర్తిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు జల్లులుగా వాన పడింది. అదేవిధంగా జిల్లాలో పలు మండలలో కూడా వాన కురిసింది. దీంతో వృద్దులు, చిన్నారులు, మహిళలు, ఈ వర్షపు చల్లదనానికి సేత తీరారు. ఈ వర్షం అన్ని రకాల పంటలకు మేలు చేస్తుంద ని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జమయమయ్యాయి.ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడి స్వల్ప అంతరాయం కలిగింది. తాళ్లపూడి మండలంలో 47 మి.మీ వర్షపాతం నమోదైనట్టు సమాచారం.

నిడదవోలులో అంధకారం

నిడదవోలు, సెప్టెంబరు 20 : ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం శుక్రవారం నిడదవోలు మెయిన్‌రోడ్లను ముంచెత్తింది. సు మారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి గాంధీ బొమ్మ సెంటరు వరకు బస్టాండ్‌ నుంచి జెండాల వీధి వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఏరి యా ఇలా పలు ప్రధాన రోడ్లన్నీ మోకాళ్ళలోతు పైనే నీట మునిగాయి.ఉరుములు, ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. నీట మునిగిన రోడ్లలో వాహనాలు మొరాయించి ఆగిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. పాఠశాలలు, కళాశా లలు వదిలే సమమయానికి కురిసిన భారీ వర్షంతో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొన్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కార ణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పట్ట ణమంతా చీకటిమయంగా మారిపోయింది. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటలు వరకూ పట్టణమంతా గాడాంధకారంలో ఉంది.

Updated Date - Sep 21 , 2024 | 12:32 AM