Share News

ప్రజారోగ్యానికి పాటుపడండి

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:09 AM

గ్రామాల్లో ప్రజారోగ్యం కోసం కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచించారు.

ప్రజారోగ్యానికి పాటుపడండి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 19 : గ్రామాల్లో ప్రజారోగ్యం కోసం కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఆరోగ్య సహాయకులకు రెండు రోజుల పాటు జరిగే శిక్షణను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సీజనల్‌ వ్యాఽధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై శిక్షణలో తెలియజే స్తారన్నారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా మలేరియా ఇన్‌ఛార్జి అధికారి డాక్టర్‌ జే.సంధ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి వ్యాఽధులు ప్రబలకుండా ఆరోగ్య సహాయకులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలిరోజు శిక్షణ కార్యక్రమంలో సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ ఐ.రామకృష్ణారావు,నక్కా వెంకటేశ్వరరావు, ఎంపీహెచ్‌ఈవో నాగు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 01:09 AM