Share News

ప్రజల చెంతకు పాలకులు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:26 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు శుక్రవా రం నుంచి ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ అనే కార్యక్రమం ప్రారంభించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలి రోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ప్రజల చెంతకు పాలకులు
మీ సమస్యలేంటమ్మా : మహిళల సమస్యలు వింటున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు,

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) /రాజమహేంద్రవరం రూరల్‌ : కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు శుక్రవా రం నుంచి ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ అనే కార్యక్రమం ప్రారంభించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలి రోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ నెల 26వ తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు, పార్టీవర్గాలు, అధికారులు ప్రజల మధ్యలో ఉంటారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులు, నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు తెలుసుకుంటారు. వాటిని నమోదు చేసుకుని పరిష్క రిస్తారు.ప్రతి ఊరులోనూ ప్రజా వేది కలు నిర్వహిస్తున్నారు.ఇందులో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. రాజ మహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కాతేరు పంచాయతీ పరిధిలో గల శాంతినగర్‌లో ప్రజల సమస్యలు తెలుసు కున్నారు. తాము గత 10 పదేళ్లగా శాంతి నగర్‌లో ఉంటున్నా మౌలిక వసతుల్లేవని వాపోయారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గోరంట్ల గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరందిస్తామని హామీ ఇచ్చారు. రాజమహేంద్ర వరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లాలా చెరువు, చౌడేశ్వరినగర్‌, వాంబే కాల నీలో పర్యటించారు.అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం పందలపాక, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావు కొవ్వూరు ఇందిరమ్మ కాలనీ, యానాది కాలనీ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నల్లజర్లలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీతానగరం మండలం ఇను గంటి వారిపేట, రామచంద్రాపురం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రధాన సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.

ఇంటింటికీ స్టిక్కర్లు..

100 రోజుల పాలన సందర్భంగా ‘‘ఇది మంచి ప్రభు త్వం’’ పేరుతో విజ య సంకేతాన్ని చూపించే రెండు వేళ్ల గుర్తుతో ఉన్న స్టిక్కరును ప్రతీ ఇంటికి ఇస్తున్నారు.దాంతో పాటు ప్రభుత్వ విజయాల కరపత్రం పంపిణీ చేస్తున్నారు. ఈ కార్య క్రమ నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ సీపీవో, డీఎల్‌ డీవోలకు బాధ్యతలు అప్పగిం చారు. మండల, పంచాయ తీలకు ప్రత్యేకాధికారులను నియమించారు.స్టిక్కర్‌, కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేసే బాధ్యతను సచివాలయ సెక్రట రీలకు అప్పగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనవచ్చు.

Updated Date - Sep 21 , 2024 | 12:26 AM