జగన్ విధ్వంసం చేసి వెళ్లిపోయాడు
ABN , Publish Date - Dec 03 , 2024 | 02:13 AM
జగన్‌రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయాడని రాజమహేంద్రవరం రూరల్ ఎెె్ముల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తా రు.
రాజమహేంద్రవరం రూరల్, డి సెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయాడని రాజమహేంద్రవరం రూరల్ ఎెె్ముల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తా రు. రాజమహేంద్రవరంలో తననివా సంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి చేసి న ద్రోహానికి, అన్యాయాలకు అక్రమాలకు ఉరిశిక్షే సరి అని వ్యాఖ్యానించారు. జగన్ గంజాయి, మ త్తుమాదక ద్రవ్యాలను పెంచిపోషించాడని, అక్ర మ మద్యంతో దోచుకున్నాడని ధ్వజమెత్తారు. పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుం డా జగన్ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సివస్తోందన్నారు. శాశ్వతంగా అధికారంలోకి ఉంటానని ఊహాల్లో ఉండి రూ.560 కోట్లు పెట్టి రుషి కొం డపై ప్యాలెస్ కట్టుకున్నాడని ధ్వజమెత్తారు. గడచిన ఐదేళ్లలో నీటిపారుదలకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రూ.3వేల పింఛను పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నాడని, తల్లిని చెల్లిని బయటకు గెంటేశాడని విమర్శించారు. ఆదాని కేసులో తన ప్రవేయం లేదని అంటున్న జగన్ అప్పుడు ఆయన సీఎం కాదా అని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ సంస్థ చర్యలు తీసుకోవడానికి తన పేరు లేదని జగన్ అనడం విడ్డూరంగా ఉం దన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క వ్యవస్థ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అన్నా రు. అసైన్డ్ భూముల్లో లక్షలాది ఎకరాలను వైసీపీ దోచుకుందన్నారు. అన్ని లెక్కలు తేలుతాయన్నారు. జగన్‌ను చెప్పులు రాళ్లతో సత్కరించాలా అని ప్రశ్నించారు. అధికారం ఉందని గతంలో ప్రజలకు అందించాల్సిన బియ్యం వైసీపీ నేతలు విదేశాలకు తరలించేశారని.. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై ఎవరు పోస్టులు పెట్టారో వారు శిక్ష అనుభవిస్తారన్నారు. ఈ సమావేశంలో టూ రిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘు రాం, దాలిపర్తి వేమన తదితరులు పాల్గొన్నారు.