జేఎన్టీయూకేలో.. వాక్ విత్ నేషన్స్
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:10 AM
జేఎన్‌టీయూకే ప్రాంగణంలో పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు సహకారంతో విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంవద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు.
జేఎన్టీయూకేలో..
వాక్ విత్ నేషన్స్
194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ
కార్యక్రమంలో పాల్గొన్న వీసీ మురళీకృష్ణ, రెక్టార్ రమణ
అక్షర క్రమంలో ఆయా దేశాల జాతీయ జెండాల ఏర్పాటు
దేశంలోని వర్సిటీల్లో ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం
జేఎన్టీయూకే, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూకే ప్రాంగణంలో పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు సహకారంతో విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంవద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. జేఎన్టీయూకే ఇన్‌ఛార్జి ఉపకులపతి కేవీఎస్‌జీ మురళీకృష్ణ బుధవారం ఆ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కేం ద్రమైన స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో మొదటిగా జేఎన్టీయూకేలో ప్రపంచదేశాల జాతీ య జెండాలను ఏర్పాటు చేయడం చాలా ఆనం దంగా ఉందన్నారు.
ప్రపంచంలో ఆరోది..
ప్రపంచంలో జెనీవా, అమెరికాలోని న్యూయా ర్క్, దక్షిణకొరియాలోని సియోల్, చైనాలోని షాం గై, డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారని, ఆరోది కాకినాడ జేఎన్టీయూకేలో ఏర్పా టు చేశామని వీసీ తెలిపారు. వసుదైక కుటుం బం అనేది దీని ముఖ్య ఉద్ధేశ్యమని, అన్ని దేశాల జాతీయ పతాకాలు ఒకే చోట ఉండడం ద్వారా కలిగే అనుభూతి చెప్పలేనిదని అన్నారు. భూమిలోని సకల జీవరాశులు ఒక కుటుంబంగా భావిస్తారని, అందుకే ఇక్కడ ప్రపంచ దేశాల జాతీ య పతాకాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
అక్షర క్రమంలో..
ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్ర పంచ దేశాల జాతీయ పతాకాలు అక్షర క్రమం లో ఉంటాయని, ప్రతి జెండా స్తంభానికి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిస్‌ప్లేను ఉంచారు. దీని ద్వారా ఆ దేశ జనాభా, రాజధాని, కరెన్సీ తదిత ర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.వర్సిటీ అను బంధ కళాశాలలతోపా టు జిల్లాలోని ప్రతి పా ఠశాల, సంస్థ జేఎన్టీయూకేను సందర్శించి ఫొటోలు తీసుకోవడాన్ని గర్వంగా భావించడంతో పాటు విజ్ఞాన, పర్యాటక ప్రదేశంగా మారబోతుందన్నారు. వాక్ విత్ నేషన్స్ అనే ప్రపంచ పౌరసత్వం స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని, ఈ ఐకానిక్ ప్రదర్శన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ కేవీరమణ, ఓఎస్టీ కోటేశ్వరరావు, సీఈ శ్రీ నివాసులు, మాజీ వీసీలు జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, బాదం సుధారాణి పాల్గొన్నారు.