‘ఘనుల’పై గురి
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:04 AM
జిల్లా గనులశాఖ డీడీ కార్యాలయంలో అడ్డూ అదుపులేని దందాలపై కలెక్టర్ షాన్‌మోహన్ సీరియస్ అయ్యారు. కార్యాలయంలో దాదాపు 17ఏళ్లుగా తిష్టవేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహ రిస్తోన్న ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని బండా రంపై ఆరా తీశారు. లీజుదారుల అక్రమాలకు సహకరిస్తూ వారు చెప్పినట్టల్లా ఆడుతోన్న స
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్.. గనులశాఖ డీడీ కార్యాలయంలో దందాలపై కలెక్టర్ ఫైర్
కార్యాలయంలో జరుగుతోన్న బాగోతంపై జేసీతో విచారణకు ఆదేశాలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లా గనులశాఖ డీడీ కార్యాలయంలో అడ్డూ అదుపులేని దందాలపై కలెక్టర్ షాన్‌మోహన్ సీరియస్ అయ్యారు. కార్యాలయంలో దాదాపు 17ఏళ్లుగా తిష్టవేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహ రిస్తోన్న ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని బండా రంపై ఆరా తీశారు. లీజుదారుల అక్రమాలకు సహకరిస్తూ వారు చెప్పినట్టల్లా ఆడుతోన్న సదరు ఉద్యోగినిపై విచారణకు ఆదేశించారు. డీడీ కార్యాలయం కేంద్రంగా జిల్లాలో క్వారీలు, గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలు, ఇతర ఉల్లంఘ నలపై ఏమాత్రం చర్యలు లేకుండా మామూళ్లు పిండేస్తోన్న తీరుపై పూర్తిస్థాయి విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు సూచించారు. ఈనేపథ్యంలో ఒకటి రెండు రోజు ల్లో జేసీ విచారణ చేపట్టనున్నారు. జిల్లా గనుల శాఖ డీడీ కార్యాలయంలో కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తిష్టవేసి మైనింగ్ లీజుదా రులకు కార్యాలయాన్ని అప్పగించేసి, ఆ ముసు గులో భారీగా సంపాదిస్తోన్న ఓ మహిళా ఉద్యో గినితోపాటు మరికొందరిపై ‘‘పెద్ద ఘనులే’’ అంటూ ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలతో శనివారం కథనం వెలువడింది. ఈనేపథ్యంలో దీనిపై కలె క్టర్ షాన్‌మోహన్ సీరియస్ అయ్యారు. డీడీ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న వరుస పరి ణామాలు, తాత్కాలిక పర్మిట్ల ముసుగులో కొంద రు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నా వారికి కొమ్ముకాస్తోన్న వైనంపై కథనంలో రావ డంతో కలెక్టర్ అసలు సంగతిపై ఆరా తీశారు. ప్రధానంగా పెద్దాపురం నియోజకవర్గం రామేశం మెట్టలో ఇచ్చిన తాత్కాలిక పర్మిట్లు, రౌతులపూ డిలో పలు క్వారీల్లో అక్రమాలు జరుగుతున్నా సదరు ఉద్యోగిని లీజుదారులనుంచి భారీగా వసూళ్లు చేస్తూ పైఅధికారులకు సైతం జేబులు నింపుతున్న వైనంపై కథనంలో రావడంతో లోతుగా ఆరాతీసి సదరు బాధ్యులైన ఉద్యోగినిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు జేసీ గనులశాఖ డీడీ కార్యాలయానికి వెళ్లి లోతు గా మరిన్ని వివరాలు సేకరించాలని సూచించా రు. వాస్తవానికి డీడీ కార్యాలయం పనితీరుపై కలెక్టర్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. రామేశంమెట్టలో అక్రమ తవ్వకాలు జరుగుతు న్నా మైనింగ్ అధికారులు నోరెత్తకపోవడం, అక్ర మ తవ్వకాలపై సర్వే చేసి దోపిడీని నిగ్గుతేల్చా లని ఆదేశిస్తున్నా డీడీ కార్యాలయంలో చలనం లేదు. మరోపక్క కొందరు లీజుదారులు ఏళ్ల తర బడి పాతుకుపోయిన సదరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోనిని అడ్డంపెట్టుకుని తమకు నచ్చనివారిపై ఫైన్‌లు, తనిఖీలు చేయిస్తూ హల్ చేయిస్తున్న తీరుతో డీడీ కార్యాలయంపై అనేకమంది వ్యాపా రులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ మే రకు కలెక్టర్‌కు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అక్రమాల బాగోతం తేల్చే దిశగా జేసీతో విచారణకు ఆదేశించారు.