గురుకులం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:33 AM
సర్పవరం జంక్షన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన పురస్కరించుకుని ఆదివారం కాకినాడ రూ రల్ మండలం పి.వెంకటాపురం సాంఘిక సంక్షేమశాఖ బాలయోగి బాలికల గురుకులం పాఠశాలను జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సం
సర్పవరం జంక్షన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన పురస్కరించుకుని ఆదివారం కాకినాడ రూ రల్ మండలం పి.వెంకటాపురం సాంఘిక సంక్షేమశాఖ బాలయోగి బాలికల గురుకులం పాఠశాలను జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలపై ప్రిన్సిపాల్ సుశీలను అడిగి తెలుసుకున్నారు. వంట ఆహారం తయారీ గదిని పరిశీలించి ఆహారం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహారం రుచికరంగా ఉందని వంటలు చక్కగా తయారు చేశారని నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. పవన్ కల్యాణ్ సోమవారం మఽధ్యాహ్నం ఇక్క డకు వస్తున్నారని, ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న అనం తరం వారితో సహపంక్తి భోజనం చేస్తారన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ రాహుల్ మీనా, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, డీఈవో రమేష్, తిమ్మాపురం ఎస్‌ఐ ఎంవీవీ రవీంద్రబాబు, ఎంపీడీవో పసుపులేటి శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.