Share News

సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:55 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 4 (ఆం ధ్రజ్యోతి): డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30గంటల నుంచి 10.30 గం

సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం
సమస్య వింటున్న కమిషనర్‌ భావన

కమిషనర్‌ భావన

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 4 (ఆం ధ్రజ్యోతి): డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9.30గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 15మంది ఫోన్‌ చేసి తమ సమస్యలు వివరించారు. అనం తరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి కమిషనర్‌ భావన 30అర్జీలు స్వీకరించారు. పలువురు కాంట్రాక్టర్లు నేరుగా కమిషనర్‌కు బిల్లుల చెల్లింపు విషయమై అర్జీలు అందించగా సానుకూలంగా స్పందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌, డిప్యూటీ కమిషనర్‌ మనోహర్‌, ఎంహెచ్‌ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, మేనేజర్‌ శిరీష్‌, టీపీఆర్వో శైలజ, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ డి.వెంకట్రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 12:55 AM