Share News

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి : కమిషనర్‌

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:12 AM

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 25(ఆంధ్ర జ్యోతి): ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రజా వినతుల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అన్నారు. శారదమ్మ గుడి వద్ద గల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్ర

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి : కమిషనర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 25(ఆంధ్ర జ్యోతి): ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రజా వినతుల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అన్నారు. శారదమ్మ గుడి వద్ద గల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంపై శుక్రవారం కమిషనర్‌ నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యే క దృష్టిపెట్టాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలను కమిషనర్‌ తెలుసుకున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 12:12 AM