Share News

‘డస్ట్‌బిన్లను వినియోగించాలి’

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:17 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 13: ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా సమకూర్చిన డస్ట్‌బిన్లను తప్పనిసరిగా వినియోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ప్రజలకు సూచించారు. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటికీ మూడేసి డస్ట్‌బిన్లను గతంలోనే అం దజేశామని, తడి-పొ

‘డస్ట్‌బిన్లను వినియోగించాలి’

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 13: ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా సమకూర్చిన డస్ట్‌బిన్లను తప్పనిసరిగా వినియోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ప్రజలకు సూచించారు. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటికీ మూడేసి డస్ట్‌బిన్లను గతంలోనే అం దజేశామని, తడి-పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేర్వేరుగా ఆయా డస్ట్‌బిన్లలో మాత్రమే వేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. నగరంలో జగన్నాథపురం, ఏటిమొగ సినిమారోడ్‌, శ్రీరామ్‌నగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను కమిషనర్‌ ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌తో కలిసి పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణలో లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన శానిటరీ సెక్రటరీకి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఎంహెచ్‌వోకు తెలిపారు. పలు మస్తరు కేంద్రాలను కమిషనర్‌ సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఆయన వెంట శానిటరీ సూపర్‌వైజర్‌ రాంబాబు, ఇన్‌స్పెక్టర్‌ ధర్మాజీ, సచివాలయ శానిటరీ సెక్రటరీ ఉన్నారు.

Updated Date - Jun 14 , 2024 | 12:17 AM