Share News

ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jun 29 , 2024 | 11:59 PM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 29: వర్షం కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. స్థానిక శిగల లక్ష్మీనారాయణనగర్‌ ప్రాంతంలో మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి ఫౌండేషన్‌ ఆస్పత్రి మీదుగా చర్చి వరకు

ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు

కాకినాడ కమిషనర్‌ వెంకటరావు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 29: వర్షం కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. స్థానిక శిగల లక్ష్మీనారాయణనగర్‌ ప్రాంతంలో మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి ఫౌండేషన్‌ ఆస్పత్రి మీదుగా చర్చి వరకు ముం పునకు గురైన ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముంపు సమస్య ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వాహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన వెంట ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, ఏఈ వై.నాగేశ్వరరావు, శానిటరీ సూపర్‌వైజర్‌ రాంబాబు ఉన్నారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీనగర్‌ పార్క్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఆయన ఎస్‌ఈ పి.సత్యకుమారి, ఇతర అధికారులతో కలిసి గాంధీపార్కును సందర్శించారు. పార్కులో పర్యటించి అక్కడి వాకర్స్‌తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈఈ మాధవి, ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ రాంబాబు, ఇన్‌స్పెక్టర్‌ రవివర్మ ఉన్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారశాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ పర్యటకు వచ్చిన సందర్భంగా కాకినాడ కమిషనర్‌ శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Updated Date - Jun 29 , 2024 | 11:59 PM