Share News

మధుమేహం పట్ల అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:26 AM

జీజీహెచ్‌(కాకినాడ), నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): చాప కింద నీరులా ప్రభావం చూపే మధుమేహం పట్ల అప్రమత్తత అవసరమని దాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.నరసింహనాయక్‌ తెలపారు. ప్రపంచ డయాబెటీస్‌ డేను పురస్కరించుకుని గురువారం అడ్డంకులను బద్దలు

మధుమేహం పట్ల అప్రమత్తత అవసరం
అవగాహనా కార్యక్రమంలో డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాయక్‌

జీజీహెచ్‌(కాకినాడ), నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): చాప కింద నీరులా ప్రభావం చూపే మధుమేహం పట్ల అప్రమత్తత అవసరమని దాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.నరసింహనాయక్‌ తెలపారు. ప్రపంచ డయాబెటీస్‌ డేను పురస్కరించుకుని గురువారం అడ్డంకులను బద్దలు కొట్టడం, అంతరాలను తగ్గించడం అనే ని నాదంతో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లో ప్రతిరోజూ మధుమేహానికి సంబంధించి రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎవరికైనా మధుమేహం ఉంటే దగ్గరలో ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లో రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, మద్యపానం, ధూమపానం, వ్యాధుల తీవ్రతపై అవగాహనా కార్యక్రమాలతో ప్రజలను చైత్యనం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ, ఆర్‌బీఎస్‌కే పీవో డాక్టర్‌ ఆర్‌.ప్రభాకర్‌, డాక్టర్‌ సురేఖ తదితరులున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:26 AM