నష్ట పరిహారాన్ని మింగేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 19 , 2024 | 11:15 PM
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 19: మత్స్యకారు లకు చెందాల్సిన వెయ్యి కోట్ల రూపాయిల నష్ట పరిహారాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అడ్డంగా దిగమింగేశారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ఓఎన్జీసీ నిర్వహిస్తున్న సిస్మిక్ సర్వే వల్ల మత్స్య కారులకు నష్టం కలుగుతుందని, మత్స్యకా రులకందరికీ సమాచారం ఇవ్వకుండా కొందరితో సమావేశం నిర్వహించారని ఆయన మంగళవా రం కలెక్టరేట్‌లో బైఠాయించి నిరసన నిర్వ
మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 19: మత్స్యకారు లకు చెందాల్సిన వెయ్యి కోట్ల రూపాయిల నష్ట పరిహారాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అడ్డంగా దిగమింగేశారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ఓఎన్జీసీ నిర్వహిస్తున్న సిస్మిక్ సర్వే వల్ల మత్స్య కారులకు నష్టం కలుగుతుందని, మత్స్యకా రులకందరికీ సమాచారం ఇవ్వకుండా కొందరితో సమావేశం నిర్వహించారని ఆయన మంగళవా రం కలెక్టరేట్‌లో బైఠాయించి నిరసన నిర్వహిం చారు. ఏటిమొగ, దుమ్ములపేట, పర్లోవపేటల్లో ఉన్న బోటు యజమానులకు సమాచారం ఇవ్వ కుండా జిల్లా కలెక్టరేట్‌లో రహస్యంగా ఎలా సమావేశం నిర్వహించారని ప్రశ్నించారు. కేవలం వైసీపీ నాయకులు, కొంతమంది పేటీఎం బ్యా చ్‌తో సమావేశం తూతూమంత్రంగా నిర్వహిం చారని ఆరోపించారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సం స్థలు మత్స్య కారుల జీవనోపాధి కోసం ఐదేళ్లుగా ఇస్తున్న నష్టపరిహారాన్ని జగన్‌రెడ్డి అండదం డలతో ద్వారంపూడి దోచుకున్నారని ఆరోపించా రు. మత్స్యకారులతో మరోసారి సమావేశం నిర్వ హించి మత్స్యకారుల డిమాండ్లను పరిష్కరించా లన్నారు. జిల్లాలో సిస్మిక్ సర్వే వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని కొండబాబు డిమాండ్ చేశారు. లేక పోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో తిప్పేనాయక్ కొండబా బుతో మాట్లాడారు. మరోసారి సమావేశం నిర్వ హించి మత్స్యకారుల సమస్యను పరిష్కరిస్తామ ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోటు యజ మానుల ప్రతినిధులు సంగాని నాగేశ్వరరావు, మల్లాడి రాజు, వనమాడి కోయిరాజు, రేకాడి లోవరాజు, ఎరుపిల్లి రాము, చోడిపిల్లి సతీష్, మూగు రాజు, చిరంజీవి, కొప్పాడి సత్యనారాయ ణ,రేకాడి ఆంజనేయులు,పంతాడి శ్రీను ఉన్నారు.
‘లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’
ఎన్నికల్లో సీటు వస్తుందనే ఆశతోనే మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లేనిపోని ఆరోప ణలు చేస్తున్నారని మత్స్యకార సంఘం ప్రతి నిధులు ధ్వజమెత్తారు. కాకినాడ లంగర్‌రేవు లోడింగ్ పాయింట్ వద్ద మత్స్యకార ప్రతినిధులు వాసుపల్లి కృష్ణ, కాటాడి సత్యనారాయణ, పాలపు నూకరాజు, ఓలేటి నూకరాజు, దండు పోలు వెంకట్రావులు విలేకర్లతో మాట్లాడుతూ మత్స్యకారులకు రావాల్సిన పరిహారం వెయ్యి కోట్లరూపాయిలు ఎమ్మెల్యే ద్వారంపూడి కాజే శారని చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓఎన్జీసీ ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని వనమాడి నిరూపిస్తే తాము ఎవ్వరినైనా నిలదీస్తామని హెచ్చరించారు. నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. సమావేశంలో మత్స్యకార సంఘాల నాయకులు కామిడి కనకాద్రి, చెక్కా శ్రీను, పి.రాంబాబు. వరిపిల్లి బలరామ్, సూరాడ శ్రీను పాల్గొన్నారు.