అన్నార్తులకు ‘అక్షయపాత్రే’
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:18 AM
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి.. గోదా వరి జిల్లాలతోపాటు విశాఖ సరిహద్దు ప్రాం తాల వారికి ఆరోగ్య వరప్రదాయిని. జీజీహెచ్‌కు వైద్యచికిత్సల కోసం నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారంతా మధ్యతరగతి, నిరుపేదలే. వీరు హోటళ్లకువెళ్లి డబ్బులు ఖర్చుచేసి భోజనం చేసే పరిస్థితి ఉండ
కాకినాడ జీజీహెచ్‌లో హరేకృష్ణా మూమెంట్ సంస్థ ఆధ్వర్యంలో ‘సుభోజనం’
నిత్యం రెండు వేల మంది రోగులు, సహాయకులకు ఉచితంగా భోజనం
(ఆంధ్రజ్యోతి- కాకినాడ జీజీహెచ్)
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి.. గోదా వరి జిల్లాలతోపాటు విశాఖ సరిహద్దు ప్రాం తాల వారికి ఆరోగ్య వరప్రదాయిని. జీజీహెచ్‌కు వైద్యచికిత్సల కోసం నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారంతా మధ్యతరగతి, నిరుపేదలే. వీరు హోటళ్లకువెళ్లి డబ్బులు ఖర్చుచేసి భోజనం చేసే పరిస్థితి ఉండదు. వీరి పరిస్థితిని గమనించిన హరే కృష్ణా మూవెంట్ సంస్థ ఉచితంగా సుభోజనం పేరిట కమ్మని భోజనం అందిస్తోంది. హరేకృ ష్ణా మూమెంట్ సంస్థను భక్తి వేదాంత ప్రభుపాద స్వామి స్థాపించారు. ఒకరోజు బెంగళూరులో భవనం పైఅంతస్తులో కూర్చొని కిటికీలో నుంచి కిందకు తొంగి చూస్తుండగా అక్కడ జరిగిన సంఘటన అక్షయపాత్ర ఏర్పాటుకు బీజం పడింది. రోడ్డు పక్కన పడేసిన విస్తర్లు, ఆకుల్లో ఉన్న ఆహారంకోసం బాలురు, కుక్కలు పోట్లాడుకోవడాన్ని చూసి ఆయన చలించిపోయారు. నిరుపేదల ఆహారం కోసం పడుతున్న ఇబ్బందులు భవిష్యత్తులో ఎక్కడా పడరాదని, ముఖ్యంగా విద్యార్థులు, అన్నార్తులకు ఈ స్థితి ఉండకూడదని భావించారు. హరేరామ్ మూ మెంట్ సంస్థ ఉన్న ప్రదేశం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఏ వ్యక్తి ఆకలితో అలమటించరాదనే ఆశయంతో 2000 సంవత్సరంలో అక్ష యపాత్రను బెంగళూరులో తొలుత 1500 మంది విద్యార్థులకు భోజనం అందించే కార్యక్రమాన్ని భక్తి వేదాంత ప్రభుపాదస్వామి ప్రా రంభించారు. ఇలా మొదలైన ఈ మూమెంట్ ఇప్పుడు అన్నిచోట్లా విస్తరించింది. మన ప్రాం తంలో విశాఖ కేజీహెచ్‌తోపాటు కాకినాడ జీజీహెచ్‌లో అక్షయపాత్ర ఆధ్వర్యంలో సుభోజనా న్ని రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. తొలు త కాకినాడ జీజీహెచ్‌లో రూ.10కే కమ్మని భోజనం ప్రారంభించిన నిర్వాహకులు దాతల సహకారంతో తర్వాత ఉచితంగా రోగులకు ఆహారాన్ని అందించి రోగులు, సహాయకుల కడుపు నింపుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్యసేవల కోసం నిత్యం 3వేల నుంచి 3,500 మంది వరకు వచ్చి ఓపీల ద్వారా వైద్యచికిత్సపొందుతుంటారు. ఇన్‌పేషెంట్లుగా మరో 2 వేలమంది వైద్యసేవలు పొందుతుంటారు. జీజీహెచ్ ప్రాంగణంలో సర్జికల్ వార్డుల వద్ద హరేకృష్ణా మూవెంట్ ఆధ్వర్యంలో 2017లో ప్రారంభించిన సుభోజనం నిత్యం రెండు వేల మందికి ఉచితంగా అందిస్తున్నారు. ముఖ్యం గా వైద్యచికిత్సల కోసం ఆస్పత్రికి వచ్చే వారి సహాయకులు బయట తినాలంటే వంద నుం చి రూ.150 వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉచితంగా లభించడంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సుభోజనంలో అన్నంతోపా టు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు వడ్డిస్తారు. దాతల సహకారాన్ని బట్టి ఒక్కో సారి ప్రత్యేక వంటకాలనూ వడ్డిస్తున్నారు.