Share News

టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో జేఎన్టీయూకే జట్టుకు ప్రథమస్థానం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:03 AM

జేఎన్టీయూకే, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన విశ్వవిద్యాలయ అంతర కళాశాలల

టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో జేఎన్టీయూకే జట్టుకు ప్రథమస్థానం
టేబుల్‌ టెన్నిస్‌ జట్టును అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు

జేఎన్టీయూకే, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన విశ్వవిద్యాలయ అంతర కళాశాలల పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో జేఎన్టీయూకే కళాశాల జట్టు ప్రథమస్థానంలో నిలిచినట్టు వర్శిటీ స్పోర్ట్స్‌కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌ తెలిపారు. అంతేకాకుండా రెండు యూనివర్శిటీల సెలక్షన్‌లను కూడా సాధించారన్నారు. ఈ జట్టు ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులోని వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌)లో జరగనున్న యూనివర్శిటీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ప్రతిభ కనబరచి ప్రథమస్థానంలో నిలిచిన టీటీ జట్టు, శిక్షణ ని చ్చిన పీడీలను యూసీఈకే ప్రిన్సిపాల్‌ ఎన్‌. మోహన్‌రావు, శ్యామ్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:03 AM