Share News

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరం : ఎస్‌డీపీవో

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:52 PM

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 28: విద్యార్థుల మనోభావాలను కించ పరిచేలా చేసిర్యాగింగ్‌కి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేదిలేదని, ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరమని కాకినాడ సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి (ఎస్‌డీపీవో) రఘవీర్‌ విష్ణు అన్నారు. బుధవారం తిమ్మాపురం అక్నూ ఎంఎస్‌ఎన్‌ పీజీ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్‌ ఎస్‌ ప్రశాంతశ్రీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌ డ్రగ్‌ అబ్యూస్‌ అండ్‌ ఆల్కహాలిజం 2024-25పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరం : ఎస్‌డీపీవో

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 28: విద్యార్థుల మనోభావాలను కించ పరిచేలా చేసిర్యాగింగ్‌కి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేదిలేదని, ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరమని కాకినాడ సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి (ఎస్‌డీపీవో) రఘవీర్‌ విష్ణు అన్నారు. బుధవారం తిమ్మాపురం అక్నూ ఎంఎస్‌ఎన్‌ పీజీ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్‌ ఎస్‌ ప్రశాంతశ్రీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌ డ్రగ్‌ అబ్యూస్‌ అండ్‌ ఆల్కహాలిజం 2024-25పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సీనియర్‌ అడ్వకేట్‌ జాబ్‌ సయ్యద్‌ సలార్‌, సైకాలజిస్ట్‌ డాక్టర్‌ వినులు అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం క్యాంపస్‌లో డీఎస్పీ మొక్కలు నాటారు. యాంటీ ర్యాగింగ్‌ విభాగం నోడల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ ఎం.నానిబాబు, రాధా మాధవి, అధ్యాపకులు డాక్టర్‌ ఎం.పోచయ్య, డాక్టర్‌ కే.జోసఫ్‌ స్టీఫెన్‌, డాక్టర్‌ మధుకుమార్‌, డాక్టర్‌ గోపీ, మనోజ్‌ దేవ, తిమ్మాపురం ఎస్‌ఐ ఎంవీవీ రవీంద్రబాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:52 PM