అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు : ఎస్పీ
ABN , Publish Date - May 03 , 2024 | 12:38 AM
కాకినాడ క్రైం, మే 2: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రజలు, ఉన్నతాధికారుల వద్ద ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ అన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఎస్‌ఐలు కేఎన్‌ఎం కృష్ణ, ఎస్‌ఐ డి.చిరంజీవి, ఏఎస్‌ఐలు ఏఎస్‌వీ
కాకినాడ క్రైం, మే 2: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రజలు, ఉన్నతాధికారుల వద్ద ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ అన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఎస్‌ఐలు కేఎన్‌ఎం కృష్ణ, ఎస్‌ఐ డి.చిరంజీవి, ఏఎస్‌ఐలు ఏఎస్‌వీస్‌ఆర్ రాజు, ఏఎస్ బాబూరావు, హెచ్‌సీ డి.సుబ్బరాజులను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా పోలీసు పరిశీలకులుగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అధికారి డాక్టర్ సంజీవ్ ఎం.పాటిల్‌ను ఎన్నికల సంఘం నియమించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు ఉంటే నేరుగా సంజీవ్ ఎం.పాటిల్ నెంబర్ 9949419654కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.