కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు : ఎస్పీ
ABN , Publish Date - May 26 , 2024 | 12:25 AM
సర్పవరంజంక్షన్, మే 25: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్ అన్నారు. ఏపీ ఎస్పీ మూడవ బెటాలియన్ ఇంగ్లీష్ మీడి యం హైస్కూల్‌లో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు
సర్పవరంజంక్షన్, మే 25: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్ అన్నారు. ఏపీ ఎస్పీ మూడవ బెటాలియన్ ఇంగ్లీష్ మీడి యం హైస్కూల్‌లో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి సతీషకుమార్ హాజరై పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు, వేసవి శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పాటు ఎప్పటికప్పుడు వారిని గమనిస్తుండడం మరువరాదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్, అసిస్టెంట్‌లు కమాండెంట్ వివి.సత్యానారాయణ, హైస్కూల్ ప్రిన్సిపాల్ విలియం బెనర్జి, ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.