సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్
ABN , Publish Date - May 29 , 2024 | 11:25 PM
పిఠాపురం, మే 29: సరైన పత్రాలు, లైసెన్సులు లేకుండా నడిపే వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండు, పాదగయ సెంటర్, ప్రభుత్వాసుపత్రి సెంటర్, బైపాస్‌రోడ్డు, మార్కెట్‌సెంటర్, చర్చి సెంటర్, ఆర్‌ఆర్ పార్కు, అగ్రహారం తదితర ప్రాంతాల్లో 14 బృందాల నేతృత్వంలో బుధవారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ నాకాబందీ నిర్వహించారు. ద్విచక్రవాహనాలను
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
పిఠాపురంలో నాకాబందీ
పిఠాపురం, మే 29: సరైన పత్రాలు, లైసెన్సులు లేకుండా నడిపే వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండు, పాదగయ సెంటర్, ప్రభుత్వాసుపత్రి సెంటర్, బైపాస్‌రోడ్డు, మార్కెట్‌సెంటర్, చర్చి సెంటర్, ఆర్‌ఆర్ పార్కు, అగ్రహారం తదితర ప్రాంతాల్లో 14 బృందాల నేతృత్వంలో బుధవారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ నాకాబందీ నిర్వహించారు. ద్విచక్రవాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని సుమారు 200 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పత్రాలు తెచ్చి చూపి ంచిన వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించారు. మైనర్లు వాహనాలు నడుపుతున్న బైక్‌లకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ నాకాబందీని ఎస్పీ సతీష్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్య ల్లో భాగంగా జిల్లాలో ఇప్పటికే కాకినాడ, పెద్దాపు రం, సామర్లకోటలో వాహన తనిఖీలు జరిగాయని, పిఠాపురంలో ప్రస్తుతం చేపట్టామన్నారు. లెక్కింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా సీఆర్‌పీసీ 144వ సెక్షన్ కింద నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ఏ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే పోలింగ్ రోజున జరిగిన సంఘటనలకు సంబంధించి అందులో పాల్గొన్న వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. వాహన తనిఖీల్లో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, ట్రైనీ డీఎస్పీ ప్రమోద్, సీఐలు జి.శ్రీనివాస్, వైఆర్‌కే శ్రీనివాస్‌తో పాటు డివిజన్‌లోని సీఐలు తదితరులున్నారు.