Share News

కేసులను సత్వరం పరిష్కరించాలి : ఎస్పీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:25 AM

కొత్తపల్లి, జూలై 26: వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్‌కు వచ్చే కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. కొత్తపల్లి పోలీస్‌ స్టే

కేసులను సత్వరం పరిష్కరించాలి : ఎస్పీ
తొండంగిలో పోలీస్‌స్టేషన్‌ పరిశీలిస్తున్న ఎస్పీ

కొత్తపల్లి, జూలై 26: వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్‌కు వచ్చే కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఏ కేసులను ఉంచవద్దని, బీచ్‌రోడ్డులో రాత్రి పూట పకడ్భందీగా గస్తీ నిర్వహించాలని ఎస్‌ఐ పీవీ స్వామినాయుడును ఆదేశించా రు. కానిస్టేబుళ్ల క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.

తొండంగి: జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం తొండంగి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఎస్‌ఐ వినయ్‌ ప్రతాప్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:25 AM