Share News

కల్వరి గిరిలో శిలువ ధారియైు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 01:06 AM

సర్వమానవాళి విమోచనకు ప్రభువైన క్రీస్తు శిలువను మోసి, ప్రాణాలు అర్పించిన రోజును గుడ్‌ ఫ్రైడేగా క్రైస్తవులు శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని సెయింట్‌ ఫాల్స్‌ లూధరన్‌ చర్చి, ఇమ్మానియేలు మినిస్ట్రీస్‌, టౌన్‌ లూధరన్‌ చర్చి, అగాపే సంఘం, సియోను ప్రేయర్‌ హౌస్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కల్వరి గిరిలో శిలువ ధారియైు..
కొవ్వూరు: వేములూరులో శిలువ యాత్ర చేస్తున్న ఆర్‌సీఎం సంఘస్తులు

  • ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు

  • చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..పలుచోట్ల శిలువ యాత్రలు

  • ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలపై ప్రబోధ

కొవ్వూరు, మార్చి 29: సర్వమానవాళి విమోచనకు ప్రభువైన క్రీస్తు శిలువను మోసి, ప్రాణాలు అర్పించిన రోజును గుడ్‌ ఫ్రైడేగా క్రైస్తవులు శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని సెయింట్‌ ఫాల్స్‌ లూధరన్‌ చర్చి, ఇమ్మానియేలు మినిస్ట్రీస్‌, టౌన్‌ లూధరన్‌ చర్చి, అగాపే సంఘం, సియోను ప్రేయర్‌ హౌస్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించారు. సెయింట్‌ ఫాల్స్‌ లూధరన్‌ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి పాల్గొన్నారు. కొవ్వూరు మండలం తోగుమ్మి ఆర్‌సీఎం చర్చి నుంచి వేములూరు దీప్తి స్కూల్లోని ఆర్‌సీఎం చర్చి వరకు పవిత్ర శిలువ మార్గం(యాత్ర) నిర్వహించారు. సంఘకాపరి ఫాదర్‌ ఫ్రాన్సిస్‌, ఫాదర్‌ ప్రణయ్‌ల ఆధ్వర్యంలో విశ్వాసులు భుజంపై శిలువను ధరించి, క్రీస్తు గీతాలాపన, శిలువ మార్గారాధన చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రేమ విందు స్వీకరించి 40 రోజులుగా చేపట్టిన ఉపవాస దీక్షలను విరమించారు. శనివారం రాత్రి జాగారపు ప్రార్థనలతో క్రీస్తు పునరుద్ధాన పండుగను నిర్వహించనున్నట్టు సంఘ కాపరి తెలిపారు. కార్యక్రమంలో వలయవీడు నెల్సన్‌ ఆంటోని, పశివేదల, తోగుమ్మి గ్రామాల సంఘస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2024 | 01:06 AM