Mudragada: మళ్లీ లేఖలు మొదలుపెట్టిన ముద్రగడ
ABN , Publish Date - Nov 15 , 2024 | 10:08 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.
కాకినాడ, నవంబర్ 15: కాపు ఉద్యమ నాయుడు ముద్రగడ పద్మనాభం (Mudragada padmanabham) మళ్లీ లేఖ రాయడం మొదలుపెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా పార్టీలో చేరే అంశంపై, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు. ఆ తరువాత ఎన్నికలు జరిగిపోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది. అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన ముద్రగడ మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.
YSRCP: అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా.. వైసీపీ వింత ప్రవర్తన
ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెబుతూ లేఖ రాశారు. కాగా.. సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యతారంగం విద్యారంగమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, యూనివర్సిటీలకు ఉపకులపతులను తక్షణమే నియమించాలని కోరారు. రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తుచేశారు. ఆయా పోస్టులను భర్తీ చేయడంలో గత వైసిపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రామకృష్ణ లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News