Share News

కరపలో మద్యం షాపు సీజ్‌

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:40 AM

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువా రం సాయంత్రం కరపలోని 115 నంబరు మద్యంషాపును సీజ్‌చేసినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు తెలిపారు. కరపమండలం పెనుగుదురులోని ఒక బెల్ట్‌షాపుపై గత నెల 22వ తేదీన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 126 మద్యం సీసాలు, 4 బీర్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌చేశారు.

కరపలో మద్యం షాపు సీజ్‌

కరప, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువా రం సాయంత్రం కరపలోని 115 నంబరు మద్యంషాపును సీజ్‌చేసినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు తెలిపారు. కరపమండలం పెనుగుదురులోని ఒక బెల్ట్‌షాపుపై గత నెల 22వ తేదీన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 126 మద్యం సీసాలు, 4 బీర్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌చేశారు. కరపలోని 115వ నెంబరు లైసెన్స్‌డ్‌ మ ద్యంషాపు నుంచి ఈ మద్యాన్ని కొనుగోలు చేసినట్టుగా అధికారుల విచారణలో నిర్ధారణైంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మద్యంషాపు లైసెన్స్‌ను ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ఎన్‌.కృష్ణకుమారి ఆదేశాల మేరకు తాజాగా మద్యంషాపును సీజ్‌చేసినట్టు సీఐ కోటేశ్వరరావు వివరించారు. కాగా కరపలో మరో ప్రధాన మద్యంషాపు వద్ద సిట్టింగ్‌ రూమ్‌లు ఏర్పాటుచేసినా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

Updated Date - Dec 06 , 2024 | 01:40 AM