నేటి నుంచి కోట సత్తెమ్మ తిరునాళ్లు
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:26 AM
నిడద వోలు మండలం తిమ్మరాజు పాలెం కోటసత్తెమ్మ ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది.
నిడదవోలు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : నిడద వోలు మండలం తిమ్మరాజు పాలెం కోటసత్తెమ్మ ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. తిరు నాళ్ళ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి పెద్ద ఎత్తున విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి 19వ తేదీ గురువా రం వరకు ఐదు రోజుల పాటు తిరునాళ్ళ మహో త్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని దేవ స్థానం సహాయ కమీషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవి శంకర్ దంపతులచే వైదిక స్మార్త ఆగమ ఆచారం కలశస్తాపనతో ఆదివారం ఉదయం ఉత్సవాలను ప్రారంభించి అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించనున్నారు.16వ తేదీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం గుర్వాయిగూడెం ఆధ్వర్యంలో చీర సారె సమర్పిస్తారు. 17వ తేదీ నిడదవోలు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చీర సారె సమ ర్పణ, 18వ తేదీన న్యాయవాది జి.ఆదిలక్ష్మి ఆధ్వ ర్యంలో రాజమహేంద్రవరం నుంచి 101 మంది మహిళలతో చీర సారె కలశాలు, బోనాలతో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ, 19వ తేది తిరునాళ్ళ ముగింపు ఉంటుంది.ఈ సం దర్భంగా సన్నాయిమేళం, గరగ నృత్యాలు, సాం స్కృతిక కార్యక్రమాలు,మహిళల కోలాటాలు, బాణ సంచాలతో ఘనంగా తిరునాళ్లు ఉంటాయి.