Share News

కొవ్వూరులో కొట్లాట

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:28 AM

చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వినాయక నిమజ్జనంలో భాగంగా రాజీవ్‌కాలనీ యువత శోభాయాత్ర శ్రీరామకాలనీ, తునిపేట మీదుగా చేపట్టారు.

కొవ్వూరులో కొట్లాట
పోలీసుల ఎదుట యువకుల గొడవ

ఇరువర్గాల మధ్య ఘర్షణ

రంగంలోకి దిగిన ఎస్పీ

పెద్ద ఎత్తున బలగాలు

గొడవపడితే క్రిమినల్‌ కేసులు

నెలాఖరు వరకు 144 సెక్షన్‌

ఇరువర్గాల పెద్దలతో చర్చలు

కొవ్వూరు, సెప్టెంబరు 20 : చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వినాయక నిమజ్జనంలో భాగంగా రాజీవ్‌కాలనీ యువత శోభాయాత్ర శ్రీరామకాలనీ, తునిపేట మీదుగా చేపట్టారు. తునిపేటకు చెందిన కొంతమంది యువత గతంలో కామెంటు చేశారు. దీంతో వినాయకుని నిమజ్జన ఊరేగింపులో ఇరువర్గాలు ఘర్షనకు దిగి గురువారం రాళ్ళతో దాడిచేసుకున్నారు. ఈ సంఘటన రెండు రోజులుగా పోలీసులు, కాల నీవాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుం ది. ఇదిలా ఉండగా రెండో రోజు శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.కొవ్వూరులో గు రువారం ఒకటో వార్డు రాజీవ్‌కాలనీలో వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. రాజీవ్‌కాలనీ,శ్రీరామకాలనీ (తునిపేట) యువకు ల ఒక రిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పోలీసులు, కాలనీవాసులు గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ బి.నరసింహకిశోర్‌ వెంటనే రంగంలోకి దిగారు. కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి నుంచి మెరకవీధి పెట్రోల్‌ బంకు వరకు అడుగడుగునా పోలీసు బలగాలతో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. అయినప్పటికి శుక్రవా రం ఉదయం మళ్లీ దాడులు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రాజీవ్‌కాలనీకి చెందిన నలుగురు యువకులు మద్యం దుకాణానికి వచ్చారు. ఇదం తా గమనిస్తున్న శ్రీరామకాలనీ యువకులు వారి ని వెంబడించి దాడిచేశారు. వారిలో ఒకరు పారిపోగా, ఇద్దరిని పోలీసులు తమ వాహనంలో ఎక్కి ంచుకుని తరలించారు. ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. తప్పించుకుని పారిపోయిన యువకుడు జరిగినదంతా కాలనీలో చెప్పడంతో కాలనీవాసులు ఒక్కసారిగా శ్రీరామకాలనీపై దాడిచేశారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో ధ్వంసం చేశారు. ఇరువర్గాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వారిన నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మా రింది. రాజీవ్‌కాలనీకి వెళ్లే దారిలో ముళ్లకంపలు, స్టాఫర్లు ఏర్పాటు చేసి పోలీసులు,రెస్క్యూ టీమ్‌లు మోహరించారు. అడిషనల్‌ ఎస్పీ సుబ్బరాజు, రాజమహేంద్రవరం సౌత్‌ డీఎస్పీ భవ్యకిషోర్‌, ఏఆర్‌ డీఎస్పీ సివార్‌కె.రవికుమార్‌,సెంట్రల్‌ డీఎస్పీ, రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ ఏఆర్‌ బెటాలియన్స్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల మధ్య వివాదాన్ని సర్దుబాటు చేసేం దుకు ఆరుగురు చొప్పన పెద్దలను పిలిచి మాట్లాడుతున్నట్లు సమాచారం. తొలిరోజు గురువారం పట్టణ సీఐ పి.విశ్వం, రూరల్‌ సిఐ కె. విజయబాబు, రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండువర్గాలపై కేసులునమోదు చేశారు.

కొవ్వూరులో 144 సెక్షన్‌

కొవ్వూరులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్‌లు ఏర్పాటు చేశాం. ఇదంతా ఆకతాయిలు చేసిన పని. రాజీవ్‌కాలనీ, శ్రీరామకాలనీలలో ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉంటుంది. బయట వ్యక్తులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. చట్టపరం గా సమస్య పరిష్కరిస్తాం. వినాయక నిమజ్జనాలను రాత్రి 7 గంటలలోపు ముగించాలి. గోదావరి ఏటిగట్టుపై సుబ్రహ్మణ్య స్నానఘట్టం వద్ద మత్స్యకారులు ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహ నిమజ్జనం వాయిదా వేసుకోవాలి.

- జి.దేవకుమార్‌, డీఎస్పీ, కొవ్వూరు

గొడవపడితే క్రిమినల్‌ కేసులే..

శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై పోలీసుశాఖ పరంగా చర్యలు తప్పవు. రాజీవ్‌కాలనీ, శ్రీరామకాలనీ వాసులకు ఇబ్బంది కలగకూడదని అడిషనల్‌ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, అద న పు బలగాలతో పికెటింగ్‌లు ఏర్పాటు చేశాం. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సిబ్బంది ఉన్నా రు.తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్‌ నాశనం అవుతుంది. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు చేపడతాం. ప్రతి ఒక్క రూ గొడవలకు దూరంగా ఉంటే మంచిది.

- నరసింహకిశోర్‌, జిల్లా ఎస్పీ

Updated Date - Sep 21 , 2024 | 12:28 AM