Share News

కొవ్వూరులో రైళ్ల హాల్ట్‌కు ఎంపీ కృషి

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:16 AM

కొ విడ్‌ కారణంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివేసిన రైళ్ల హాల్ట్‌లను పునరుద్ధరించడానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషిచేస్తున్నారని బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఎంపీని కలిసి కొవ్వూరులో రైళ్ల హాల్ట్‌పై వినతిపత్రం అందజేశారు.

 కొవ్వూరులో రైళ్ల హాల్ట్‌కు ఎంపీ కృషి
ఎంపీ పురంధేశ్వరికి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

  • త్వరలో ఐదు రైళ్ల నిలుపుదల

  • బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేంద్ర

కొవ్వూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొ విడ్‌ కారణంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివేసిన రైళ్ల హాల్ట్‌లను పునరుద్ధరించడానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషిచేస్తున్నారని బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఎంపీని కలిసి కొవ్వూరులో రైళ్ల హాల్ట్‌పై వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కొవ్వూరు జరిగిన విలేకరుల సమావేశంలో పిక్కి నాగేంద్ర, 9వ వార్డు కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ కొవ్వూరు రైల్వేస్టేషన్‌ల్లో కొవిడ్‌ కారణంగా నిలుపుదల చేసిన రైళ్ల హాల్ట్‌లను పునరుద్ధరించకపోవడంతో కొ వ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో 100కు పైగా గ్రా మాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై గత ప్రభుత్వంలో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేశామన్నారు. మంగళవారం పురందేశ్వరిని కలిసి మరోసారి వినతిపత్రం అందించామన్నారు. కొవ్వూరు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశామన్నారు. దీంతో ఆమె కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనివైష్టవ్‌తో మాట్లాడారని, కొవ్వూరు ప్రజల సౌకర్యార్ధం అత్యవసరంగా 5 రైళ్లను (సర్కార్‌, సింహాద్రి, తిరుమల, తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, రాజమహేంద్రవరం టు భీమవరం వెళ్లే రైళ్లను) నిలుపుదల చేయాలని కోరారన్నారు. ఈ నెల 29న అశ్వనివైష్టవ్‌ను కలవడానికి అపాయింట్‌మెంటు కోరారన్నారు. త్వరలో మరో 5 రైళ్లు కొవ్వూరులో ఆగుతాయని బీజేపీ నాయకులు అన్నారు. అయితే కొందరు కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇది సరికాదన్నారు. సమావేశంలో బోడపాటి ముత్యాలరావు, మాట్లా ఆంజనేయులు, ముప్పరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 01:16 AM