కృష్ణా జిల్లా నుంచి ధాన్యం సేకరణ
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:52 AM
కృష్ణాజిల్లాలో రైసు మిల్లులు తక్కువగా ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి తుఫాన్ కారణంగా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.
అమలాపురం టౌన్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లాలో రైసు మిల్లులు తక్కువగా ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి తుఫాన్ కారణంగా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా కృష్ణాజిల్లా మొవ్వ, తోట్ల వల్లూరు మండలాల నుంచి ధాన్యం సేకరించేందుకు ఇద్దరు పౌరసరఫరాల అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. శనివారం నుంచే ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టినట్టు ఆమె స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాలో ధాన్యం సేకరణ అత్యంత వేగవంతంగా జరుగుతుందని జేసీ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణలో నిమగ్నమైన పౌరసరఫరాల సిబ్బంది మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరపాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ బాలసరస్వతి, జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.విశాలాక్షి పాల్గొన్నారు.