నూతన ఇసుక విధానంతో నష్టపోతున్నామం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:22 AM
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు,
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నూత న ఇసుక విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా ఇసుక లేక, గ్రావెల్ రవాణాకు వీలు లేక లారీలు దాదాపు ఖాళీగా ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. లారీలకు ఫైనాన్స్ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని... గత ప్రభుత్వ హాయాంలో లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బం దులు పడ్డామని, కూటమి ప్రభుత్వం రావడంతో తమ కష్టాలు తీరతాయని ఆశించామని అయితే నూతన ఇసుక విధానంతో తమకు మరిన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. లారీలు, ట్రాక్టర్లు, బండ్లు ద్వారా ఉచితంగా ఇసుక రవాణాకు అవకాశం కల్పిండంతో లారీలకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్లు, ట్రాక్టర్లు ద్వారా తెచ్చిన ఇసుకను తాము కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఇసుక బుకింగ్ వల్ల రోజుకి ఒక ట్రిప్పు కూడా వేసే పరిస్థితి లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవ తీసుకుని కూటమి ప్రభుత్వం ఇసుక విషయంలో లారీల పట్ల సానుకూల నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గ జనసే న ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుకు వినతి అందజేశారు.
‘నా భూమిని కాపాడండి’
పోర్జరీ డాక్యుమెంట్లుతో తనకు ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దాడి శ్రీను ఆవేదన వ్యక్తం చేసి చేబ్రోలులోని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశాడు. కొత్తపల్లి మండలం యండపల్లిలో తనకు 3.38 ఎకరాల పొలం ఉందని, దానిని పోర్జరీ సంతకాలతో పెనుపోతుల కృష్ణబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని శ్రీను చెప్పాడు. దీనిపై పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని తన భూమిని కాపాడి, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని అతడు కోరాడు.