లక్కవరంలో కార్పొరేట్ వైద్యం అందిస్తాం
ABN , Publish Date - Aug 29 , 2024 | 01:12 AM
లక్కవరంలో ఆనాడు మంగెన కుటుంబీకులు ప్రజా ఆరోగ్యం కోసం ఏవిధంగా తాపత్రయం పడ్డారో మనం వారి ఆశయాలకు తగ్గట్టే ఇక్కడ కార్పొరేట్ వైద్యం ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలకు అందేలా చర్యలు తీసుకుందామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో కార్పొరేట్ వైద్యం
మలికిపురం, ఆగస్టు28: లక్కవరంలో ఆనాడు మంగెన కుటుంబీకులు ప్రజా ఆరోగ్యం కోసం ఏవిధంగా తాపత్రయం పడ్డారో మనం వారి ఆశయాలకు తగ్గట్టే ఇక్కడ కార్పొరేట్ వైద్యం ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలకు అందేలా చర్యలు తీసుకుందామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. 2.60ఎకరాల భూమిఉందని, రెండు ఎకరాల స్థలం ఖాళీగా ఉందని, ఈస్థలాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో కార్పొరేట్ వైద్యం ప్రజలకు చౌకగా అందించేలా చేద్దామన్నారు. రాజోలు ప్రభుత్వాసుపత్రిని ఎన్‌సీసీ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. లక్కవరం పీహెచ్‌సీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మంగెన భూదేవి, ఎంపీపీ ఎంవీ సత్యవాణి, సర్పంచ్ కోట పుష్పకుమారి, ముప్పర్తి నాని, మంగెన నాని పాల్గొన్నారు.