Share News

వరాహ అవతారంలో వేంకటేశ్వరస్వామి

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:11 AM

దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని రాయవరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వరాహ అవతారంలో పూజలందుకున్నారు.

వరాహ అవతారంలో వేంకటేశ్వరస్వామి

రాయవరం, డిసెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని రాయవరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వరాహ అవతారంలో పూజలందుకున్నారు. భక్త సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ అర్చకుడు స్వామివారికి వెండి పుష్పాలతో అర్చనలు, నీరాజన మంత్ర పుష్పాలు, మహానివేదన జరిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు అంగరబాబు, పెద్దింటి కృష్ణామాచార్యులు, అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:11 AM