ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన ఏసుక్రీస్తు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:20 AM
మానవుల్లో ప్రేమ తత్వాన్ని మేల్కొల్పి మానవత్వం మూర్తీభవించిన మహనీయులుగా మార్చేందుకు ఏసుక్రీస్తు భూలోకానికి నరావతారిగా వచ్చారని మన్నాజూబ్లీ చర్చి సంఘ కాపరులు రెవ. కార్ల్ డేవిడ్ కొమానపల్లి, రెవ.ఎర్నెస్ట్ తాతపూడి, ఎస్తేరుజ్యోతి తాతపూడి, సెయింట్ లూథరన్ చర్చి సంఘ కాపరి రెవ.కేకే పాల్, బ్రదర్ నోబుల్‌ప్రవీణ్ పేర్కొన్నారు.
అమలాపురంటౌన్, డిసెంబర్25(ఆంధ్రజ్యోతి): మానవుల్లో ప్రేమ తత్వాన్ని మేల్కొల్పి మానవత్వం మూర్తీభవించిన మహనీయులుగా మార్చేందుకు ఏసుక్రీస్తు భూలోకానికి నరావతారిగా వచ్చారని మన్నాజూబ్లీ చర్చి సంఘ కాపరులు రెవ. కార్ల్ డేవిడ్ కొమానపల్లి, రెవ.ఎర్నెస్ట్ తాతపూడి, ఎస్తేరుజ్యోతి తాతపూడి, సెయింట్ లూథరన్ చర్చి సంఘ కాపరి రెవ.కేకే పాల్, బ్రదర్ నోబుల్‌ప్రవీణ్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పుర స్కరించుకుని అమలాపురం పట్టణ పరిసర ప్రాం తాల్లో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పలు వురు ప్రముఖులు పాల్గొన్నారు. నల్లవంతెన దిగు వన ఉన్న మన్నా జూబ్లీ చర్చి, జీడీఎం చర్చి, మెయిన్‌రోడ్డులోని సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలలో వేలాది మంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. మహిపాలవీధిలోని అమలోద్భవీ మాత ఆలయంలో బాలఏసు ప్రతిమను ఉంచి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మన్నా జూబ్లీ చర్చిలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్రీస్తు జననాన్ని వివరిస్తూ రూపొందించిన నాటిక, నృత్య ప్రదర్శనలు, దేవదూతల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు ప్రార్థనా మందిరాల్లో ప్రేమామయుడైన యేసు నేడు పుట్టెను.. అంటూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. ఏసు క్రీస్తును స్తుతిస్తూ యువత ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచారు. స్థానిక చర్చిలో రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వాసా ఎస్.దివాకర్, గీత దంపతులు చిన్నారులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. లూథరన్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో సెనేడ్ డెలిగేట్ నక్కా రాజ్‌కిశోర్, కోశాధికారి కె.పెద్దబ్బాయి, గూటం ప్రసాద్, మెండి ఇజ్రాయిల్‌రాజు, జి.కృపావరం పాల్గొన్నారు.