గ్రంథాలయ ఉద్యమానికి బాటలువేసిన మహనీయులు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:48 AM
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం సవరప్పాలెం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమానికి బాటలు వేసిన మహనీయులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
అమలాపురం రూరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం సవరప్పాలెం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమానికి బాటలు వేసిన మహనీయులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ నిర్వాహకుడు ఎన్వీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమనస శ్రీరామా పబ్లిక్ స్కూలులో గ్రంథాలయ ఉద్యమానికి బాటలు వేసిన డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యింకి వెంకటరమణయ్య చిత్రపటాలకు ప్రిన్సిపాల్ పురాణపండ లక్ష్మీగణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమలాపురం ప్రథమశ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జీవీ ఆర్‌ఎస్‌హెచ్‌కే వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలిశెట్టి సత్యనారాయణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.